రోడ్లకు ఇరువైపులా చాల అందంగా కనిపించే ఈ చెట్లపై పక్షులు గూళ్ళు కట్టవు.. వీటి పువ్వులపై వుండే మకరందాన్ని సీతాకోకచిలుకలు, క్షీరదాలు ఆస్వాదించడమే కాదు కనీసం వీటి పుప్పొడి ని కూడా టచ్ చెయ్యవు..పశువులయితే వీటి ఆకులను అస్సలు ముట్టవు.. మొక్కలు నాటడం వలన మానవాళి కి ఎంతో లాభం కానీ ఈ మొక్క పెరగడం వలన ప్రకృతికి శాపమే కాదు మనుషులకు తీవ్ర నష్టం… బాబోయ్ అనుకుంటున్న ఈ మొక్క ఏ అమెజాన్ అడవుల్లోనో.. లేక మనకి దూరంగా వున్న కొండ ప్రాంతాల్లో వుండేది కాదు.. మన ఇంటి పక్కన… రోడ్డు మధ్యలో… మన ఆఫీసుని ఆనుకుని పెరుగుతున్న చెట్లే అవి.. అందం గా కనిపిస్తూ విషప్రభావాన్ని విపరీతంగా వెదజల్లుతున్న ఆ చెట్టు పేరే కోనోకార్పస్(conocarpus) చెట్ల వల్ల పర్యవరణానికి, మనవాళికి లాభాలే తప్ప నష్టాలూ ఉండవు. ఐతే ఈ మొక్క మాత్రం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండడంతో తెలంగాణ రాష్ట్రం సహా అనేక రాష్ట్రాలు ఈ మొక్క పై ఇప్పటికే నిషేధం విధించాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న హరితహారంలో కూడా ఈ మొక్కలను నాటకూడదని అధికారులకు ఆదేశిలిచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదన్నది మరో కోణం.ఆ సంగతి అలా వదిలేస్తే ఇంతకీ కోనోకార్పస్ నిజం గా అంత డేంజరా…? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు వీటి వల్ల పర్యావరణానికి మేలు జరగకపోగా.. హానే ఎక్కువ కలుగుతోందని వారంటున్నారు. కోనోకార్పస్ పువ్వుల నుంచి వెలువడే పుప్పొడి వల్ల అలర్జీ, శ్వాసకోశ, ఆస్తమా సమస్యలు వస్తున్నాయని పలు పరిశోధనల్లో తేలింది. వీటి వేర్లు భూమి లోపల ఎనభై మీటర్లకు పైగా లోతుకు చొచ్చుకుపోయి మధ్యలో అడ్డు వచ్చే కమ్యూనికేషన్ కేబుల్స్, డ్రైనేజీ లైన్లు, మంచినీటి వ్యవస్థలను ధ్వంసం చెయ్యడమే కాకుండా భూగర్భ జలాలను స్ట్రా వేసి తాగినట్లు తాగేస్తాయట. అంతే కాకుండా ఈ చెట్టు వున్న ప్రాంతం లో ఆక్సిజన్ శాతం కూడా తక్కువగా వుంటుంది..మొత్తంగా ఈ చెట్టు వల్ల పర్యావరణానికి ఏ రకంగానూ మేలు జరగపోగా దుష్ప్రభావాలు కలగజేస్తోన్న ఈ చెట్లను ఇప్పటికే భారీ స్థాయి లో పలు మున్సిపాలిటీల్లో సుందరీకరణ కోసం కోనోకార్పస్ మొక్కలను నాటారు. రోడ్ల మధ్య పచ్చదనాన్ని పెంచేందుకు ఈ చెట్లను ఎక్కువగా పెంచుతున్నారు. విశాఖ లో హుదూద్ వచ్చి పచ్చదనం మొత్తం పోయిన తరువాత ప్రకృతి పునరుద్ధరణ కు సిటీ మొత్తం గా ఈ చెట్లనే నాటారు ఇవి తక్కువ సమయంలోనే నిటారుగా..ఏపుగా పెరిగేలక్షణం వున్న మొక్క అందంగా కనిపించడం వల్ల అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఈ కోనోకార్పస్ మొక్కలనే పెంచుతున్నాయి. ఇందులో అనేక ఉపజాతులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాల్లో, తీర ప్రాంత మడ అడవుల్లో ఇవి పెరుగుతాయి. బలమైన ప్రవాహాలను తట్టుకునేందుకు వీలుగా…. వీటి వేర్లు బురదనేలల్లోకి అనేక మీటర్ల లోతుకు వెళ్తాయి. తద్వారా చెట్టుకు స్థిరత్వమిస్తాయి. ఫలితంగా తీర ప్రాంతాల్లో నదులు, సముద్రాలు కలిసే చోట… నీటి ప్రవాహాల వేగాన్ని అడ్డుకుంటాయి. ఆఫ్రికా, ఆసియా దేశాల్లోని పట్టణాలు, నగరాల్లో సైతం సుందరీకరణకు వీటినే వినియోగిస్తున్నారు. పాకిస్తాన్, ఇరాన్ వంటి కొన్ని దేశాలు మాత్రం ఈ మొక్కను నిషేధించాలని ఇప్పటికే నిర్ణయించాయి. అనేక పరిశోధనల అనంతరం… కోనోకార్పస్ మొక్కలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనోకార్పస్ మొక్కలపై పూర్తి స్థాయిలో నిషేధం విధించాలని కోరుతున్నారు. సాధారణంగా అడవులను నరికి వేస్తే పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతారు. కానీ ఇప్పుడు భిన్నంగా ఈ మొక్కలు నాటకూడదంటూ స్వరం వినిపిస్తుంటే మరి కొందరు ఈ డేంజర్ మొక్కను తొలగించాలని కోరుతున్నారు.