తెలుగు హీరోల బిహేవియర్ పై నిర్మాత బండ్ల గణేష్ తాజా ట్వీట్ వివాదాస్పదంగా మారింది. కొందరి హీరోలను టార్గెట్ చేస్తూపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను చూసి నేర్చుకొండయ్యా అని పెట్టిన ఈ ట్విట్ పై ఇప్పుడు చర్చ మొదలైంది. ఓ వైపు పవన్ కళ్యాణ్, మరోవైపు అడవిశేష్, సిద్దు జొన్నలగడ్డ ఫోటోలు పెట్టి మరి హీరోల ఆటిట్యూడ్ ను ఏకీ పారేశాడు. తన ప్రసంగాలతోనూ, ట్వీట్లతోనూ ఎప్పుడు వివాదాలు సృష్టించే బండ్ల గణేష్ తాజా ట్వీట్ తో కూడా మరో వివాదాన్ని మూట గట్టుకున్నాడు. ఎవరి పరిధిలో వాళ్ళు కంఫర్టబుల్ గా ఉండడానికే ట్రై చేస్తారు. ఆ క్రమంలో వారు నడిచే నడిచే విధానం, కూర్చునే తీరు, మాట్లాడే శైలి ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని బండ్లకు కొంతమందిని నెటిజన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. కౌంటర్ తో పాటు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ సినిమా సినిమా ఫంక్షన్లలో కాలు మీద కాలేసుకుని కూర్చున్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ మరి ఇప్పుడు ఏమంటావో బండ్లన్న అంటూ రీ ట్వీట్ చేస్తున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండాలన్నదే తన అభిప్రాయమని దీనిని వివాదాస్పదంగా మార్చాలన్నది తన ఉద్దేశ్యం కాదని బండ్ల గణేష్ చెబుతున్నప్పటికీ వివాదం బాగానే రాజుకోవడం ట్వీట్ ని తొలగించినట్లు తెలుస్తోంది..
previous post