అసలు భూమి తన చుట్టూ తిరుగుతూనే సూర్యూని చుట్టూ కూడా తిరుగుతోంది. తన చుట్టూ తాను తిరిగేందుకు ఒక రోజు సమయం పడితే.సూర్యున్ని చుట్టి రావటానికి ఏడాది పడుతుంది. భూమి గంటకు దాదాపు 1600 కిలోమీటర్లకి పైగా వేగంగా ప్రయాణిస్తుంది. మనం ఏదైనా వెహికల్ లో కాస్త స్పీడ్ గా వెళ్తేనే అదోలా అయిపోతుంది మరీ అలాంటిది అంతా స్పీడ్ గా భూమి ప్రయాణిస్తుంటే ఆ విషయమే మనకు ఎందుకు తెలియదు. ఆ స్పీడ్ ను మనమెందుకు ఎక్స్ పీరియన్స్ చేయం. దీనికి ప్రధాన కారణం గ్రావిటీయే. భూమికి ఉన్న ఆకర్షణ గుణం కారణంగా భూమి తిరుగుతున్న విషయాన్ని మనం గ్రహించలేం. భూమిపై ఉన్న శిఖరాలు,మంచు పర్వతాలు, అడవులు, సముద్రాలు, నదులు ఇలా ప్రతి ఒక్కటీ భూమితో అనుసంధానమై ఉంటాయి. ఈ అటాచ్ మెంట్ లో మనుషులు కూడా ఉంటారు. భూమికి ఉన్న ఆకర్షణ శక్తి కారణంగా అది తిరుగుతున్నప్పటికీ ఆ ఫీల్ ను మనం ఎక్స్ పీరియన్స్ చేయలేమన్నమాట…