ట్రిపుల్ ఆర్ సినిమాకు భారత ప్రభుత్వం అన్యాయం చేసేసిందని ఓ మంచి చిత్రానికి ఆస్కార్ దక్కకుండా అడ్డుకుందని సోషల్ మీడియా అతివాద మేధావుల గొంతులు చించేసుకుంటున్నారు దేశసంపద అంతా గుజరాతీయులకి దోచిపెడుతున్నట్లే చివరాకరికి ఆస్కార్ అవార్డును కూడా వాళ్ళకే ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని బోరున విలపిస్తూ మిడిమిడి జ్ఞానులు తెగ వాపోతుండడం చూస్తుంటే కూసింత ఆశ్చర్యం.. మరింత అసహ్యం కలగక మానదు.. బాహుబలి చిత్రంతో దేశాన్ని ఆకర్షించిన రాజమౌళి ఆ స్థాయిలో ఆర్ ఆర్ ఆర్ నీ తెరకెక్కించలేదన్న వాస్తవాన్ని చాలా మంది హార్డ్కొర్ అభిమానులు ఎందుకు మర్చిపోతే ఎలా..? గుజరాతి సినిమా చెల్లోషా (ఆఖరాట) అఫీషియల్ ఎంట్రీగా భారత్ నుంచి ప్రకటించడం నుంచి మీడియా అంతా త్రిపుల్ ఆర్ కి జరిగిన అన్యాయంపైనే దృష్టిపెట్టేసింది. నిజానికి మేకర్స్ కూడా ఒక మాస్ హిస్టీరియని క్రియేట్ చేసి ప్రేక్షకులపై ముఖ్యంగా నెటిజన్ల పై వదిలారు ఆస్కార్ అవార్డు అనేది హాలీవుడ్ అవార్డులు అందులో ఒకే ఒక కేటగిరి మాత్రమే విదేశాలకు చెందింది అంతే తప్ప ప్రపంచ అవార్డులు కావు అన్న మినిమం లాజిక్ ని కూడా మిస్ అయ్యి అతి ప్రచారం చేసేసుకుని అన్యాయం జరిగిందని ఏడిస్తే ఎలా అన్న కామెంట్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు అంటే కంగనా తో రికమండ్ చేయించుకుని రాజ్యసభ సీటు తీసుకున్నంత ఈజీ కాదే అన్న విమర్శలు బాహాటంగానే వెలువెత్తుతున్నాయి ఇక ఇప్పటి వరకు అఫీషియల్ ఎంట్రీగా భారతదేశం నుంచి వెళ్లిన ఒకే ఒక తెలుగు సినిమా విశ్వనాథుడి స్వాతిముత్యం మాత్రమే ఎంట్రీ గా అయితే వెళ్ళింది కానీ నామినేషన్ మాత్రం దక్కించుకోలేకపోయింది అంతమాత్రాన అది మంచి చిత్రం కాకుండా పోతుందా ఇక గుజరాతి గోల విషయానికొస్తే 2013లో మాత్రమే ది గుడ్ రోడ్ అనే సినిమా అఫీషియల్ ఎంట్రీగా వెళ్ళింది అది కూడా నామినేషన్ దక్కించుకోలేదు మొట్టమొదటిసారి భారతదేశ నుంచి 30వ అకాడమీ అవార్డుకు (1957) లో వెళ్లిన మదర్ ఇండియా సలాం బాంబే (1988) లగాన్ (2001) మాత్రమే ఆస్కార్ నామినేషన్లను పొందాయి. 2013లో గుజరాతి సినిమా అఫీషియల్ ఎంట్రీ గా భారత్ నుంచి ఆస్కార్ కి పంపినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఎప్పుడు రాని గుజరాతి దుమారం ఇప్పుడే రావడం కూడా కొంత వారి అజ్ఞానానికి నిదర్శనం అవార్డులో లాబియింగ్ సహజమే కానీ ఆస్కార్ నిబంధనలు వేరు అన్నది గ్రహిస్తే మంచిది. అయినా మన మార్కెటింగ్ మనకు ముఖ్యం మన పబ్లిసిటీయే మనకు వేదాంతం అని అనుకుంటే అది నూటికి నూరు శాతం తెలుగు సినిమా ఆరోగ్యానికి హానికరమే..
previous post
next post