Vaisaakhi – Pakka Infotainment

ఆధ్యాత్మిక ప్రభంధం కదంబం

కదంబ వృక్షాన్ని రుద్రాక్షంబ అని కూడా అంటారు దీని శాస్త్రీయ నామం ఆంథో లాస్ సెఫాలస్ చినెన్సీన్ ఈ ఆకు రాల్చని వృక్షం ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటూ నీడను బాగా ఇస్తుంది అడవుల్లో ఎక్కువగా పెరిగే కదంబ వృక్ష పుష్పాలు గుండ్రంగా బంతుల్లా ఉంటాయి. దీన్ని పుష్పాల నుంచి పెర్ఫ్యూమ్ లు కూడా తయారు చేస్తుంటారు మరో వైపు దీని కలప ను బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు ఈ మొక్క పెరిగేందుకు మోస్తరు నీరు ఉంటే సరిపోతుంది. ఉష్ణ మండల ప్రాంతాల్లో విరివిగా ఈ వృక్షం పెరుగుతుందని జియాలజిస్టులు చెప్తుంటారు.. ఈ కథంబ వృక్షాన్ని పురాణాల్లో రెండు రకాల పేర్ల తో వ్యవహరిస్తుంటారు.. ఉత్తర భారతంలో కృష్ణ వృక్షం గా దక్షిణ భారతలో పార్వతీ వృక్షం గా పిలువబడే ఈ దేవతా వృక్షానికి కృష్ణుడికి చాలా సంబంధం ఉంది రాధాకృష్ణుల ముచ్చట్లు ఈ వృక్ష నీడ లోనే జరిగాయని అందుకే ఈ కదంభాన్ని కృష్ణవక్షమని పురాణాలు చెబుతున్నాయి అలాగే పార్వతీ వృక్షం అని కూడా పిలుస్తుంటారు. నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అని కూడా కొంత మంది భావిస్తుంటారు.. ఏది ఏమైనా అన్నాచెల్లెళ్లు నారాయణ, నారాయణీ బంధాన్ని కూడా ఈ వృక్షం చాటి చెబుతోందని చెబుతుంటారు దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం. ఈ కధాంభాన్ని గురించి ఓ ఇతిహాసకధ కూడా ఉంది ఆ కాలంలో గార్డభాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భూమి మీద మానవులలో, జంతువులతో మరణం లేకుండా ఉండాలని వరం కోరుతాడు. భోళా శంకరుడు శివుడు తధాస్తు అని వరమిచ్చి అంతర్ధనమవుతాడు. వరగర్వం ప్రభావం తో దేవలోకం చేరి ఇంద్రుడిని తరిమి కొడతాడు గార్ధబాసురుడు దీంతో దేవేంద్రుడు శ్రీమహావిష్ణువుని వెంటపట్టుకుని పరమేశ్వరుని దగ్గరకి వెళ్ళి మొర పెట్టుకుంటారు.. గార్దబాసురుని ఆగడాలనుంచి విముక్తి కల్పించామని కోరతారు. అయితే తాను వరం ఇచ్చిన విషయం పరమశివుడు చెప్తే ఆ సమయంలో శ్రీమహావిష్ణువు ఓ సరదా ప్రస్తావన తీసుకువస్తారు. నువ్వు గార్డభాసురుని చంపితే నేను నీకు దాసుడిగా ఉంటానంటాడు. దానికి ప్రతిగా పరమశివుడు కూడా నువ్వు కనుక ఆ అసురుడ్ని సంహరించినట్లయితే నేనే నీకు దాసుడిగా ఉంటాను అని వాగ్ధానం చేస్తాడు.. అసుర సంహారం లో భాగంగా మోహిని రూపం ధరించిన శ్రీ మహావిష్ణువు దక్షిణాన ఉన్న గార్డభాసురుని రాజ్యానికి సమీపంలో వనానికి చేరుతాడు అదే సమయంలో విష్ణువు కు సహాయం చేయాలని ఉద్దేశంతో ఆ వనానికి అందమైన కన్యరూపం లో వచ్చిన పార్వతి దేవి అమ్మవారి అందానికి ముగ్ధులైన రాక్షసులు ఆమె దగ్గరికి చేరుతారు మరోవైపు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై ఆమె వెంటపడతాడు. మొహం లో ఉన్న గార్ధభాసురుడుని ఆకాశంలోకి ఎగరేసి తోడేలు మనిషి రూపంలో మారి సంహరిస్తాడు. ముఖం తోడేలు మొండెం మనిషి రూపంలో ఉండి పరమేశ్వరుని వరానికి భంగం కలగకుండా చంపుతాడు అలా సంహరిస్తున్న తరుణంలో అసురులను సంహరించడాని కదంబ వృక్షంగా మారి అగ్ని జ్వాలతో రాక్షసులు అందర్నీ సంహరిస్తుంది అమ్మవారు దీంతో గార్డభాసురుని సంహారం జరిగిపోయింది. అయితే ఇచ్చినమాట ప్రకారం పరమ శివుడు హనుమంతుని అవతారంలో శ్రీరామునికి సేవలు అందించి మాట నిలబెట్టుకున్నాడు శివుడు. కదంబ వృక్షానికి పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని పండితులు చెప్తారు గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజలు నిర్వహిస్తే దోష నివృత్తి జరుగుతుందంటారు.. గ్రహ దోషాలు ఉన్నవాళ్లు కదంబ వృక్షానికి పూజ చేసిన తర్వాత పెరుగన్నన్ని పార్వతి దేవికి నివేదించాలి ఓం శక్తి రూపేణ్య నమః అన్న మంత్రంతో పూజిస్తే అధ్బుతఫలితాలు మన సొంతం.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More