మొన్నటి వరకు పొన్నియన్ సెల్వన్- బాహుబలి సినిమాలను కంపేర్ చేస్తూ ట్రోలర్స్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. తమిళ్ ఆడియన్స్, తెలుగు ఆడియోస్ మధ్య ఈ రెండు సినిమాలకు సంబంధించి వివాదం కొనసాగుతుంది. మా సినిమా గొప్ప అంటే మా సినిమా గొప్ప అని అలాగే రెండు సినిమాలకు సంబంధించి తప్పులను ఎత్తి చూపుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ నటించిన ఆది పురుష్ వంతోచ్చింది. ఈ మూవీ టీజర్ ను ఐదు భాషలలో రిలీజ్ చేశారు. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా టీజర్ ఆశించిన స్థాయిలో లేదని విమర్శలు వస్తున్నాయి. మరి ముఖ్యంగా వి.ఎఫ్.ఎక్స్ యానిమేషన్ సినిమాను తలపించే విధంగా ఉన్నాయని ట్రోల్ చేస్తున్నారు. గతంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన కొచ్చాడియన్(సుల్తాన్) మూవీని తలపించే విధంగా ఆదిపురుష్ ఉందని అంటున్నారు. సగం రియల్ మిగతా సగం పూర్తిగా యానిమేషన్ గా రూపొందించినట్లు టీజర్ ను చూస్తే తెలుస్తుందని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. రామాయణం మీద ఎన్నో టీవీ సీరియల్స్, సినిమాలు వచ్చాయి. కానీ శ్రీరాముడిని పూర్తిగా ఈ సినిమాలో మీసకట్టుతో చూపించడంపై కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. దీనికి తోడు వి.ఎఫ్.ఎక్స్ వర్క్స్ కు పేలవంగా ఉండటంతో పెదవిరుస్తున్నారు. హిందీ ఆడియన్స్ కూడా టీజర్ బాగోలేదని ట్రోల్ చేస్తున్నారు. ఇక కోలీవుడ్ అయితే చెప్పనవసరం లేదు. మొన్నటి వరకు బాహుబలి మూవీపై విరుచుకుపడిన తమిళ్ ఆడియోస్ ఇప్పుడు ఆది పురుష్ పై పడ్డారు. ఇక నెటి జన్స్ కూడా ఆది పురుష్ టీజర్ పై కాపీ పేస్ట్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. టీజర్‌లో చాలా విజువల్స్ పలు హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టేసినవంటూ వాటి రిఫరెన్సుల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. ‘డిజప్పాయింటెడ్’ అంటూ ఓ హ్యాష్‌ట్యాగ్‌ని కూడా ట్రెండింగ్‌లోకి తెచ్చేశారు నెటిజన్లు ‘ఆదిపురుష్’ సినిమా విషయమై. మరీ అంతలా కాపీ సన్నివేశాలున్నాయా.? అంటూ ఆయా సినిమాల్లోని రిఫరెన్సుల్ని పోల్చి చూస్తున్న ప్రభాస్ అభిమానులు, ‘ఔను.. నిజమే, మా హీరోని దెబ్బ కొట్టారు..’ అంటూ దర్శకుడు ఓం రౌత్ మీద మండిపడుతున్నారు. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. చిత్ర నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ నుంచి వంశీ, ప్రమోద్ భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. 2023 జనవరి 12 న సంక్రాంతి కానుకగా ఈ మూవీ హిందీ, తెలుగు,తమిళ, మలయాళం భాషల్లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన టీజర్ పై ట్రోలింగ్ అయితే కొనసాగుతుంది.