Vaisaakhi – Pakka Infotainment

ఆకే అని తీసి పారేస్తే …

బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుండే జామకాయలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి . రుచిగా ఉండే జామపండును లేదా జామకాయను తింటాం. కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా? వాటిల్లో ఉండే పోషకాల గురించి విన్నారా? ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నిజానికి జామకాయలో కంటే జామ ఆకుల్లోనే ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉండే  జామ ఆకుల టీ క్యాన్సర్ తో పోరాడటమే కాకుండా  కొలెస్ట్రాల్ ను సైతం ఈ  తగ్గించడమే కాకుండా  బలమైన యాంటీ బాక్టీరియల్ చర్యలను అందిస్తుందని వివిధ అధ్యయనాల్లో తేలింది. అలాగే, సాధారణ జలుబు మరియు ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి సాంప్రదాయ ఔషధం ఎండిన ఆకులను ఉపయోగిస్తుంది. ఇంకా, ఇది డెంగ్యూ వైరస్ సంక్రమణ వంటి క్లిష్ట పరిస్థితికి సహాయపడుతుంది జామ ఆకుల యొక్క శోథ నిరోధక లక్షణాలు పంటి నొప్పిని పరిష్కరిస్తాయి. మరియు వాపును తగ్గించడంలో   సహాయపడతాయి. పంటి నొప్పిని తగ్గించుకునేందుకు లేత జామ ఆకులను నోట్లు వేసుకుని నమలితే చాలు.. .  ఇంకా జామాకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడడమే కాకుండా  స్త్రీ లలో ఏర్పడే  రుతుస్రావం యొక్క నొప్పిని తగ్గించడానికి జామ ఆకులు అత్యద్భుతంగా పని చేస్తాయి. జామ చెట్టు లేత ఆకులు తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి. చిన్నప్పుడు చాలా మంది ఈ లేత ఆకుల్లో చింత పండు పెట్టుకుని తినడం గుర్తుండే ఉంటుంది. ఈ ఆకు వల్ల లాభాలు మనకు అప్పుడు తెలియక పోయినా… అలా ఈ జామ లేత ఆకులను తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. జామ ఆకులను తరచూ తినడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె పని తీరుపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. అయితే చాలా మంది ఈ ఆకులను నోట్లో వేసుకుని నమలడం ఇష్టం ఉండదు. లేదా ఇంట్లో జామ చెట్టు ఉండదు. కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే ఈ ఆకులు దొరుకుతాయి. జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరయు విటమిన్ సి. అంతే కాదు ఈ ఆకుల్లో క్వర్సిటిన్, ఫ్లవనోల్ అనే శరీరానికి అవసరం అయ్యే మంచి ఫ్లెవనాయిడ్స్ ఇందులో పుష్కలంగా ఉండే ముదురు జామ ఆకులను తీసుకుని వాటిని నీడలో ఆరనివ్వాలి. ఆకు పూర్తిగా ఎండిపోయాక… దానిని చూర్ణం చేసి నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకున్నా మంచి ప్రయోజనాలే కలుగుతాయి. ఇలా నీళ్లల్లో కలుపుకుని తాగలేని వారు.. ఆ చుర్ణాన్ని చిన్న చిన్న గోళీల మాదిరిగా తయారు చేసుకుని మింగేయ్యాలి. చిగుళ్ల నొప్పీ, నోటిపూతా తగ్గడమే కాకుండా  వ్యాధినిరోధకశక్తిపెరగుతుంది  ఇన్ని ఆరోగ్యప్రయోజనాలకు ప్రధాణ కారణం  జామ ఆకులు, బెరడు నుంచి తయారు చేసిన పదార్థాలు కేన్సర్‌, బాక్టీరియా ద్వారా వచ్చే అంటు వ్యాధులు, వాపులు మరియు నొప్పి నివారణలో వైద్యంగా వాడుతున్నారు. ఈ జామాకుల నుంచి తయారు చేసిన నూనెలు కేర్సర్‌లు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఈ జామ ఆకులను నాటు వైద్యంగా డయేరియాకి మందుగా ఉపయోగిస్తారు. బెరడు ఏంటీ మైక్రోబియల్‌, ఏస్ట్రింజంట్‌ లక్షణాన్ని కలిగి ఉంటుంది. వీటిని చక్కెర వ్యాధి తగ్గించడంలో కూడా ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో జామ పండు పై తొక్క తొలగించి పంచదార పాకం పట్టి ఎరుపు రంగు కలిపి రెడ్ గోవా అనే పేరుతో విక్రయిస్తారు.
జామకాయ జ్యూస్ కాలేయానికి ఒక మంచి లివర్ టానిక్ వంటిది. ఈ జ్యూస్ ను తీసుకొన్నప్పుడు. ఎలాంటి దుష్ర్పభాలు లేకుండా ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.  జామఆకు వల్ల మరో ఆరోగ్య ప్రయోజనం డయోరియా సమస్యలను నివారిస్తుంది . అంతే కాదు, ఇతర పొట్ట సమస్యలను కూడా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. జామ వేర్లు ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించి వడగట్టి కాలీ పొట్టతో తీసుకుంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది. జామఆకుల వల్ల మరో గ్రేట్ హెల్త్ బెనిఫిట్, డేంగ్యూతో బాధపడే వారికి ఈ లీఫ్ జ్యూస్ ఔషధం వంటిది . శరీరంలో ఎలాంటి క్రిములనైనా నాశనం చేస్తుంది. జామఆకుల జ్యూస్ త్రాగడం వల్ల ఇది ప్రొస్టేట్ క్యాన్సర్ మరియు ప్రొస్టేట్ ఎన్ లార్జ్ మెంట్ ను నివారిస్తుంది . పురుషుల్లో ఇలాంటి క్యాన్సర్స్ కు ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More