స్టార్ కాకముందే వార్తల్లోకి ఎక్కిన సురేష్ ప్రొడక్షన్స్ వారసుడు దగ్గుబాటి అభిరామ్ హీరో గా తేజ దర్శకత్వం లో రూపుదద్దుకుంటున్న అహింస చిత్రం రామానాయుడి మనవడిని హీరోగా నిలబెడుతుందా అన్న చర్చ ఫిల్మ్ నగర్ లో మొదలైంది. ఎందరో యువ హీరోలకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు తేజ చాలా కాలం తర్వాత, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, ఆర్‌పి పట్నాయక్‌ల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ తో ప్రేక్షులముందుకు రానుంది.. ఎప్పుడో తయారు చేసుకున్న ఏక్షన్ ఓరియెంటెడ్ ప్రేమ కధా చిత్రం నితిన్ కి జయం చిత్రం లా అభిరామ్ హిట్ ఇవ్వడం ఖాయం అన్న టాక్ నడుస్తోంది.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. అభిరాం ని హీరోగా ప్రమోట్ చేద్దామా తనలా నిర్మాణ రంగంలోకి తీసుకొద్దామా అని ఆలోచించి సురేష్ బాబు ఫైనల్ గా తన రెండవ వారసుడిగా అభిరామ్ నీ తేజ చేతిలో పెట్టారు.. ఇప్పటికే హీరో ఫేస్ రివీల్ కాకుండా విడుదలైన గ్లింప్స్ ఆడియన్స్ ని ఆకట్టుకోగా ఆర్పీ పట్నాయక్ స్వరపరిచిన పాట ప్రేక్షకుల ముందుకొచ్చిన చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని సిద్ శ్రీరామ్ తన గాత్రం తో అలరించాడు. శ్రీరెడ్డి కాంట్రవర్సీయల్ ఆరోపణలతో ఎక్కువ మందికి తెలిసిన అభిరామ్ నటనతో మెప్పించి ఇండస్ట్రీ లో తన స్థానాన్ని ఎలా లాక్ చేసుకుంటాడో చూడాలి..
previous post