Vaisaakhi – Pakka Infotainment

అష్టాదశ కు ఎందుకు అంత ప్రాధాన్యత …?

“పూర్ణమదః పూర్ణమిదం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పుర్ణాత్పూర్ణముదచ్యతే | పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” నూట ఎనిమిది లో ఒకటి జీవుడిని తెలియచేస్తుంది. ఎనిమిది జీవుని తత్త్వాలను తెలియ చేస్తుంది. పూర్ణం(సున్నా) పరిపూర్ణ భగవత్తత్త్వము. ఈ శరీరాన్ని, జీవుడిని కలిపి నియమించేది పరిపూర్ణ భగవత్తత్త్వము నూట ఎనిమిది 1+0+8 = 9, చాలా ముఖ్యమైన సంఖ్య. 9 తో ఏది కలిపినా వచ్చిన సంఖ్యలో సంఖ్యలను కలిపితే చివరకు అదే సంఖ్య వస్తుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే.108 అనేది కేవలం సంఖ్య మాత్రమే కాదు.. మంత్రం జపానికి అనుసంధానించబడిన అమృతసంఖ్య. అష్తోత్తరాలలో 108 నామాలతో దేవతలను ఆరాధిస్తాము. దీని వెనుకున్న ప్రధాన కారణం ఇరవైఏడు నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు నాలుగు ఇరవై ఏడులు నూటెనిమిది అలాగే పన్నెండు రాశులు తొమ్మిది నక్షత్ర పాదాలు (12×9=108) అంటే ఎవరైనా ఈ 108 నక్షత్ర పాదాలలో ఏదో ఒకదానిలో పుట్టి ఉంటాడు కావున ఈ సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఏర్పడింది.అ ఇదొక్కటే కాదు మరెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ సంఖ్యతో ముడిపడి ఉండడం తో విశేష ప్రాముఖ్యత ఏర్పడింది. చాలా చోట్ల అష్టాదశ సంఖ్య ప్రయోగం కనిపిస్తుంది. ఈ సంఖ్యకి ఇచ్చిన ప్రాముఖ్యం మరో సంఖ్యకి ఇవ్వలేదు అనిపిస్తుంది. అయితే ఈ అష్టాదశ సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యం, పరమార్థం విశ్లేషిస్తే.. వేద వ్యాసుడు తన రచన వ్యాసంగా నంతా అష్టాదశతోనే విభజించాడు అష్టాదశపురాణాల తో పాటు మహాభారత గ్రంధాన్ని అష్టాదశ పర్వాలుగానే విభజించాడు అష్టాదశ దినాలు జరిగిన మహా భారత సంగ్రామం లో పాల్గొన్న రధ, గజ, పదాతి దళాల సంఖ్యను కూడా అష్టాదశతోనే వచ్చినట్లుగాపేర్కొన్నారు. జగన్మాత ఆదిపరాశక్తి పీఠాలు అష్టాదశ. మనకు నదులు పూజనీయాలు పరమ పవిత్రాలు ఒక్కొక్క నదిలో ఒక్కో సంవత్సరం పుష్కరం జరుగుతుంది.. భారతదేశంలో ఎన్నో నదులున్నప్పటికీ 18 నదులకు ప్రత్యేకత ఎంతో వుంది. హిందువుల ప్రామాణిక గ్రంథాలు వేదాలు దీని శ్రుతిలో అంటారు ఈ శృతిలకు తర్వాత రెండవ స్థానం ఆక్రమించేది స్మృతులుఇవి కూడా మొత్తం అష్టాదశ మనకు ఉన్నాయి అష్టాదశ ఉప పురాణాలు ఇక అష్టాదశ నరకాలు కొండ మీద ఉన్న దేవాలయ గర్భగుడి కి వెళ్లే సోపానాలు కూడా అష్టాదశ ఉండాలి. ప్రతి వ్యక్తి మోక్ష సౌధ సోపానాలను అధిగమించాల్సి ఉంటుంది ఇవి మొత్తం కూడా అష్టాదశ. ఇక ఖగోళ పరంగాసూర్యునికి, భూమికి ఉన్న దూరం 149.6 మిలయన్ కిలోమీటర్లు ఈ దూరాన్ని సూర్యుని చుట్టుకొలత 1391000 కిలోమీటర్లతో తో భాగిస్తే వచ్చే సంఖ్య 108 అలాగే చంద్రునికి, భూమికి ఉన్న దూరం 38లక్షల కిలోమీటర్లను చంద్రుని చుట్టుకొలత అయిన 3474 కిలోమీటర్లతో తో భాగిస్తే వచ్చే సంఖ్య కూడా నూట ఎనిమిదే హైందవం ప్రకారం ముఖ్య శివలింగాలు 108, అందుకే శైవ మతాలు కూడా 108 వైష్ణవ దివ్య క్షేత్రాలు కంబోడియాలో ఆంగ్కోర్ వాట్ గుడిలో 108 మంది (అసురులు, దేవతలు) కలిసి సాగరమధనం చేసినట్టు చిత్రింపబడివుంది. హైందవ భావాలనుండి ప్రేరణ పొందిన బౌద్ధం ప్రకారం పంచేంద్రియాలతో స్పృహ ను కలిపి ఆరు భావాలను, వాటివల్ల కలిగే అంతర్భావాలైన సుఖము, దుఃఖము, స్తిరత్వబుద్ధిని, గుణించి, అవి బాహ్యంగానైనా, ఆంతరంగానైనా భూత భవిష్యద్ వర్తమానాలలో కలిగిన భావనలను గుణిస్తే వచ్చే సంఖ్యకూడా నూట ఎనిమిదే. ఆయుర్వేదం ప్రకారం 108 మర్మ స్థానాలు, శక్తి కేంద్రాలు ఉండగా కేరళ మర్కకళ కలారిపయట్టు లో 108 ప్రెజర్ పాయింట్స్ వున్నాయి. 108 జపం మనస్సును నిర్మలం చేస్తుంది, లోపలున్న భావాలను అణగదోక్కుతుంది. సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వాటికి శివ, శక్తి తత్త్వాలైన స్త్రీ, పురుష రూపాలుంటాయి. అలా ఏబై నాలుగు ఇంటూ రెండు నూట ఎనిమిది. ఇంకా ఎన్నో విశిష్టతలను తనలో ఇముడ్చుకున్న సంఖ్య వైశిష్ట్య సంఖ్య నూట ఎనిమిది. అందుకే మన ఋషులు, ద్రష్టలు ఎప్పుడో 108 సంఖ్య ప్రాముఖ్యతను మనకు నామాలలో, ప్రదక్షిణలలో, జపాలలో విధిగా ప్రస్తావించారు.. ఋషులు పండితులు అష్టాదశ సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఇచ్చారంటేనే అర్ధం చేసుకోవచ్చు ఇదేంత విశిష్ట సంఖ్యో…

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More