ఈ సంక్రాంతి కి అతి పెద్ద పందెం కోళ్లు తమ ‘వీర’త్వాన్ని ప్రదర్శించేందుకు సిద్ధం అవుతున్న తరుణంలోనే మరో ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది అది వర్కౌట్ అయితే తెలుగు సినిమా మరో పెద్ద పండుగకు సిద్ధమైనట్టే. చిరు , బాలయ్య కాంబో మూవీ అనగానే అది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.. అది కూడ అల్లు అరవింద్ నిర్మాతగా అంటే ఇంకాను. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ల కాంబోలో భారీ ఎత్తున మూవీ చేయాలన్నది సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కోరిక. అన్ స్థాపబుల్ రీసెంట్ ప్రోమోలో నందమూరి బాలకృష్ణకు అల్లు అరవింద్ తన మనసులో మాట చెప్పడం తో అభిమానులు ఇది ఎప్పుడు నిజమవుతుందా అని ఆరాలు మొదలు పెట్టేసారు. 90వ దశకం నుంచి నేటి వరకు కూడా చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ కొనసాగుతుంది. వీరితో పాటు సీనియర్ హీరోలు విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున ల మానియా తగ్గినప్పటికీ చిరు, బాలయ్యలు మాత్రం తమ హవాను కొనసాగిస్తున్నారు. నంబర్ వన్ లో చిరంజీవి ఉండగా, నంబర్ టు లో బాలకృష్ణ కొనసాగుతున్నారు. వీరిద్దరూ ఎన్ని హిట్ సినిమాలు ఇచ్చినప్పటికీ వీరిద్దరి స్థానాలు అలాగే ఉంటున్నాయి. యంగ్ హీరోలకు పోటీగా వీరిద్దరి సినిమాలు వస్తున్నాయి. ప్రత్యేకించి ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఒకప్పుడు భగ్గుమనే పరిస్థితి ఉన్నప్పటికి ఇప్పుడు పరిస్థితి వేరు.ఈ సీనియర్ హీరోలు ఇద్దరు ఎదురుపడితే ఒకరికొకరు బాగానే పలకరించుకుంటారు. కానీ వృత్తి పరంగా వీరిద్దరి మధ్య పోటీ గట్టిగానే ఉంటుంది. అది ఎలా అంటే పాకిస్తాన్ – ఇండియా క్రికెట్ మ్యాచ్ ను ఆడియన్స్ ఎంత ఆసక్తిగా తిలకిస్తారో, అదే తరహా ఆసక్తి ఇద్దరు హీరోల అభిమానులలో ఉంటుంది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప.. మా హీరో సినిమా హిట్ అంటే మా సినిమా హీరో హిట్.. మా హీరో సినిమా రికార్డుల బ్రేక్ చేసింది.. ఇండస్ట్రీ రికార్డు కొట్టిందని గతం లో ఇద్దరు హీరోల అభిమానులు ఘర్షణ పడటం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో అయితే వార్ సారాసరే. అటువంటిది చిరు- బాలయ్యలు కలిసి ఒకే సినిమాలో కనిపించడం అన్నది, అది అల్లు అరవింద్ నిర్మాతగా వీరిద్దరితో సినిమా అంటేనే అంచనాలు అన్నీ మారిపోతున్నాయి. అయితే పాత్రల నిడివి క్యారెక్టరైజేషన్ వంటి అంశాల్లోనైతే వివాదం చెలరేగే అవకాశం లేకపోలేదు. గతంలో ఇవివి డైరెక్షన్ లో అక్కినేని నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ లో వారసుడు అనే మూవీ వచ్చి సూపర్ హిట్ అయింది. అయితే ఆ మూవీలో ఒక సీన్ హీరో కృష్ణను నాగార్జున అవమానించే రీతిలో ఉందని కృష్ణ అభిమానులు నానా హడావుడి చేశారు. గొడవకు దిగారు. అటువంటిది ఇప్పుడు ఇద్దరు సీనియర్ హీరోలు, అది టాప్ పొజిషన్లో ఉన్న హీరోలు, దశాబ్దాలుగా వీరి సినిమాలు మధ్య తీవ్ర పోటీ ఉన్న పరిస్థితి, వాస్తవానికి అటు చిరుగాని ఇటు బాలయ్య కానీ సరైన కథ ఉంటే ఇద్దరం కలిసి నటించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ అప్పట్లోనే డైరెక్టర్ కోదండ రామిరెడ్డి ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. కానీ ఎందుకనో అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడదే కాంబినేషన్ మూవీ పై చర్చ మొదలయ్యింది. అన్ స్టాపబుల్ రీసెంట్ ప్రోమోలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఎప్పటికైనా తాను చిరంజీవి- బాలకృష్ణ లతో కలిసి సినిమా చేస్తానని చెప్పారు. అది తన చిరకాల కోరికని కూడా వెల్లడించారు. అయితే అదే కార్యక్రమంలో ఉన్న బాలకృష్ణ అల్లు అరవింద్ చెప్పిన విషయానికి పాజిటివ్ గా స్పందించారు. తనకు చిరంజీవితో కలిసి పనిచేయడం లో ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తామిద్దరం చేస్తే అది పాన్ వరల్డ్ సినిమా కావడం ఖాయమని బాలయ్య అన్నారు. దీనిని బట్టి అల్లు అరవింద్ ఇప్పుడు కాకపోయినా సరే భవిష్యత్తులో అయినా సరే చిరు- బాలయ్యలతో కలిసి సినిమా చేయడం ఖాయమని స్పష్టమవుతుంది. తను ఏదైనా అనుకున్నాడంటే అది కచ్చితంగా చేసి తీరుతాడనే పేరైతే అల్లు అరవింద్ కి ఇండస్ట్రీలో ఉంది. ప్రస్తుతం బాలయ్య- చిరు కాంబినేషన్ మూవీపై వచ్చిన చర్చే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి చక్కెర్లు కొడుతుంది.
previous post
next post