నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకి కొన్ని నిక్కచ్చిన అభిప్రాయాలు ఉన్నాయి నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించి చూపించడం లో అసలు తగ్గేదేలే.. అనేవారట.. దైవ పూజా కార్యక్రమాల మీద నమ్మకం లేకపోయినా చాలా విషయాల్లో నియమి నిబంధనలు పాటిస్తూ వ్యక్తిత్వ నిరూపణ చేసుకోవడమంటే చాలా ఇష్టం అట. అక్కినేని తొలిసారిగా సీతారామ జనంలో రాముడు గా నటించిన విషయం అందరికీ తెలిసిందే ఘంటసాల బలరామయ్యగారి తీసిన చిత్రంలో వేమూరి గగ్గయ్య రావణుడు పరశురాముడుగా ద్విపాత్రాభినయం చేశారు అలాంటి దిగ్గజ నటులతో నటించడం అంటే మాటలు కాదు.. అప్పటికి సినిమా అనుభవం లేనందున జంకుతో బెదురు చూపులతో నటించినప్పటికీ పర్వాలేదు అనిపించుకున్నారు అయితే ఈ చిత్రంలో నటించినందుకు అక్కినేని అందుకున్న పారితోషకం 250 రూపాయలు తొలి సంపాదన గుర్తుగా 70 రూపాయలతో ఎర్రపొడితో బంగారు ఉంగరాన్ని చేయించుకున్నారు ఆ చిత్రం తర్వాత వందల సంఖ్యలో నుంచి వేలకు లక్షలకు కోట్లకు పారితోషకం పెరిగి నిర్మాత గా స్టూడియో అధినేత గా ఎంత ఎదిగినా తన సినీ నటన సంపాదనకు గుర్తుగా ఆ ఎర్రపొడి ఉంగరాన్ని ఏళ్లు దాటిన తన వేలికి అలంకరణగా నాటి తొలి చిత్రం మధురానుభూతికి సాక్షిగా ఉంగరాన్ని ఉంచుకుంటున్నారు. అక్కినేని ని ఎక్కువ కాలం అంటిపెట్టుకున్నది ఆ ఉంగరం ఒకటే.