ప్రేక్షకుల ముందుకొచ్చిన కల్కి రికార్డ్ల దుమ్ము దులుపుతోంది.. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్న తేడా లేకుండా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటున్న వైజయంతీ మూవీస్ కల్కి వూహించని తారలతో ఆడియన్స్ కి సర్ప్రైజింగ్ ఇచ్చింది దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా రూపొందిన కల్కి లో దుల్కర్ సల్మాన్ (DULKAR SALMAN), మృణల్ ఠాకూర్ (MRUNAL TAKUR), దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి(SS RAJAMOULI), రామ్ గోపాల్ వర్మ (RAMGOPAL VARMA) వంటి వారు గెస్ట్ రోల్స్ లో అలరించారు. వాటిలో విజయ్ దేవరకొండ నటించిన అర్జునుడి పాత్ర హైలెట్ గా నిలిచింది.. ఈ క్యారెక్టర్ లో విజయ్ పర్పెక్ట్ గా సరిపోయారు. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో చూపించే బలమైన ఎమోషన్స్ తన నటనతో పలికించారు విజయ్ దేవరకొండ. నిడివి తక్కువే అయినా అర్జునుడిగా విజయ్ మేకోవర్, చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ కల్కిలో ఒక హైలైట్ గా నిలుస్తున్నాయి. విజయ్ క్యారెక్టర్ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి హ్యూజ్ అప్లాజ్ వస్తోంది. విజయ్ ను మైథాలజీ పాత్రల్లో చూసే అవకాశం అరుదు కాబట్టి కల్కి సినిమా ఆయన కెరీర్ లోనూ ఓ స్పెషల్ మూవీ గా చెప్పుకోవచ్చు. హిందీ బెల్ట్ లోనూ విజయ్ దేవరకొండ కు మంచి ఫాలోయింగ్ వుండడం తో అక్కడి ఫ్యాన్స్ కూడా విజయ్ సీన్స్ కి భారీ అప్లాజ్ ఇస్తున్నారు. డియర్ కామ్రేడ్ హిందీ చిత్రం 400మిలియన్ వ్యూస్ తో యూ ట్యూబ్ ని షేక్ చేస్తున్న తరుణం లో గాండీవధారి పాత్ర లో దేవరకొండ దుమ్ము లేపుతున్నారనే చెప్పొచ్చు.