వరుణ్ సందేశ్ హీరోగా ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం స్వీయ దర్వకత్వం లో కాండ్రకోట మిస్టరీ అన్న క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారం గా నిర్మించిన చిత్రం ‘నింద’ ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. మైత్రీ మూవీస్ నైజాంలో రిలీజ్ చేస్తున్న . నింద మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్ సిద్దార్థ్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ..‘ నా కెరీర్‌లో స్వామిరారా, కార్తికేయ ఎలా పడిందో.. నింద అనేది వరుణ్ కెరీర్‌కు ఓ మైల్ స్టోన్‌లా మారాలి. నింద మూవీని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. నింద అనే మూవీతో వరుణ్ సందేశ్‌కు హిట్ రాబోతోందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ‘నిఖిల్ ఎదుగుదలను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. నిఖిల్, నేను కలిసి 2007లో హ్యాపీడేస్ చేశాం. అప్పుడు నా వయసు 17. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఇలా ఒకే స్టేజ్ మీదకు వచ్చాం. దాదాపు నా సగం లైఫ్ సినిమా ఇండస్ట్రీలోనే గడిచింది. గత ఏడేళ్లుగా నా భార్య వితిక నాకు అండగా ఉంటూ వచ్చింది. ఆమెకు నేను ఎంత చేసినా, ఏం చేసినా తక్కువే అవుతుంది. నింద నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను. కానీ నాకెప్పుడూ ఇలా అనిపించలేదు. ఎంతో కంఫర్టబుల్‌గా జీవితాన్ని గడుపుతున్న రాజేష్ తన ఫ్యాషన్‌తో ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు. ఆయనకు తన కథ మీద చాలా నమ్మకం ఉంది. ఎంతో గట్స్, కాన్ఫిడెన్స్ తో నిర్మించారు. టీం అంతా కూడా సింక్‌లో ఉండి పని చేసింది. అందరూ వంద శాతం ఎఫర్ట్స్ పెట్టారు. ఈ సినిమాను ఇండస్ట్రీలోని కొంత మందికి చూపించాం. ఆ తరువాత మాలో మరింత పాజిటివిటీ పెరిగింది. మైత్రీ వారు మా మూవీని రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రయాణంలో రాజేష్ గారు నాకు ఓ బ్రదర్‌లా మారిపోయారు. తక్కువ రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేశాం. నాకు గాయమైనా కూడా రాజేష్ గారి కోసమే షూటింగ్ చేశాను. ఈ చిత్రం తరువాత రాజేష్ గారు ప్రాజెక్టులు చేస్తూనే ఉంటారు. ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా, మంచి దర్శకుడిగా, నిర్మాతగా నిలబడతారు. రమీజ్ కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. సాంతు ఓంకార్ మ్యూజిక్, ఆర్ఆర్ ఎంతో ఇంటెన్స్‌గా బాగుంటుంది. అనిల్ గారి ఎడిట్ సూపర్బ్‌గా ఉంటుంది. శ్రేయా, అన్నీ, మధు అందరూ చక్కగా నటించారు. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ.. నెక్స్ట్ ‘నింద’ అని గర్వంగా చెప్పుకోగలను. మా బామ్మ ఈ మూవీ చూశారు. అన్ని వర్గాల ఆడియెన్స్‌కు ఈ మూవీ నచ్చుతుంది. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
నటి వితిక షెరు, దర్శక, నిర్మాత రాజేష్ జగన్నాథం, మ్యూజిక్ డైరెక్టర్ సాంతు, ఎడిటర్ అనిల్, కెమెరామెన్ రమీజ్,
నటి శ్రేయా రాణి , నటి అన్నీ, క్యూ మధు, మైత్రీ మూవీస్ శశిధర్ రెడ్డి ’ డివో మ్యూజిక్ మాధురి తదితరులు మాట్లాడుతూ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించారు.