కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికిగాను ప్రకటించిన భారతదేశ మూడవ అత్యున్నత అవార్డ్ పద్మభూషణ్ ను స్వీకరించక ముందే మధురగాయని వాణి జయరామ్ కన్నుమూయడం దక్షిణ భారత సినీ పరిశ్రమలో తీవ్ర విషాధాన్ని నింపింది.చెన్నైలోని నుంగంబాక్కంలోని తన స్వగృహంలో పడిపోవడంతో వాణీ జయరామ్ మరణించినట్లు ఆమె సన్నిహితులు తెలిపినప్పటికి ఆమె మరణాన్ని పోలీసులు అనుమానస్పద మృతి గా నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరిగా నివసిస్తున్న వాణి జయరామ్ ముఖం పై గాయాలు ఉన్నట్టు పోలీసులు చెప్పారు.ఇంటిలో పనిచేసే మలర్కొడి కాలింగ్ బెల్ కొట్టినప్పటికీ ఆమె తలుపు తెరవలేదని చెప్పారు. మలర్కొడి భర్త కూడా ఆమెకు ఫోన్ చేసినప్పటికి ఎత్తలేదన్న సందేహం తో. ఆయన కూడా ఫోన్ పోలీసులకు ఫోన్ చేసినట్టు చెప్పారు.ఇటీవల పద్మభూషణ్ అవార్డు రావడంతో చాలామంది వచ్చివెళ్తున్నారని వివరించారు. పంతొమ్మిది భాషలు, ఇరవై వేల పాటలు వేలాది భక్తి గీతాలు, ఎన్నో సంగీత ప్రధాన పాటలతో శ్రోతలను అలరించిన వాణీ జయరాం అసలు పేరు కలైవాణి 1945లో తమిళనాడులోని వేలూరులో జన్మించారు. దాదాపు 5 దశాబ్దాల పాటు తన స్వరంతో ప్రేక్షకులను అలరించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ సహా 19 భాషల్లో పదివేలకు పైగా పాటలను ఆమె పాడిన ఆమె అయిదేళ్ల వయస్సులో కడలూరి శ్రీనివాస్ అయ్యంగార్ వద్ద సంగీతంలో ఓనమాలు దిద్ది పదేళ్ల వయస్సులోనే తొలిసారి ఆలిండియా రేడియాలో పాటలు పాడారు.1970లో గుడ్డీ చిత్రంతో ఆమె గాయనిగా పరిచయం అయినప్పటికి బాలీవుడ్ రాజకీయాలకు దక్షిణాది ప్రతిభ ఓడిపోయిన ఆమె తిరిగి వెనుతిరిగారు. ‘అభిమానవంతుడు’ సినిమాతో ఆమె తెలుగు సినిమాలో అరంగేంట్రం చేసిన వాణి జయరామ్అపూర్వ రాగంగళ్ , శంకరాభరణం, స్వాతికిరణం చిత్రాల్లో పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు.స్వాతికిరణం సినిమాలోని “ఆనతినీయరా హరా” పాట ఆమెకు ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది.