దర్శనం, లడ్డు ధరల్లో ఎటువంటి మార్పు లేదని ప్రకటించిన టీటీడీ..

300 రూపాయల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ధరలను సవరించిందని పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ పేర్కొంది..కొన్ని సోషల్ మీడియా లలో 50 రూపాయలు వుండే శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలును టీటీడీ సవరించినట్లు వచ్చిన వార్తలను నమ్మవద్దని తెలిపింది .ప్రత్యేక ప్రవేశ దర్శనం కొరకు దళారులను సంప్రదించొద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. కొన్ని వాట్స్అప్ గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొంద వచ్చునని కొంతమంది వారి ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం సర్కులేట్ చేస్తున్నారని వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ మరియు టీటీడీ యాప్ ద్వారానే జరుతుందని ఇది కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొన్ని టికెట్ల కేటాయింపు జరిగిందని భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టిక్కెట్లను పొందే సౌకర్యం ఉన్నది. టూరిజం ద్వారా రావాలి అనుకొనే భక్తులు, దళారీ ల ద్వారా కాకుండా, నేరు గా, రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉంది. భక్తులు గమనించ గలరని విజ్ఞప్తి చేసింది.
కొందరు దళారులు అమాయకులను తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా మీకు టిక్కెట్లు బుక్ చేసి ఇస్తామని ఇందుకుగాను ధర ఎక్కువ అవుతుందని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు టీటీడీ దృష్టికి వచ్చిందని దానిపై టిటిడి విజిలెన్స్ విభాగము కఠిన చర్యలు తీసుకుంటుందని ఇటువంటి దళారుల మాటి నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేయడమైందని టీటీడీ ఒక ప్రకటన లో తెలిపింది.

Related posts

టికెట్ ధరకు విలువైన వినోదాన్ని గ్యారెంటీగా ఇస్తుందంటున్న దర్శకుడు

‘మట్కా’ నుంచి వింటేజ్ బ్రాండ్ న్యూలుక్ పోస్టర్స్

అక్టోబరు 19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల విడుదల

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More