“తంగలాన్” కు సీక్వెల్ చేస్తాం – సక్సెస్ మీట్ లో హీరో చియాన్ విక్రమ్

“తంగలాన్” రిలీజ్ కు ముందే నేను పా రంజిత్, జ్ఞానవేల్ గారికి చెప్పాను. ఇది తెలుగు ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకునే సినిమా అవుతుందని ఎందుకంటే ఇది మట్టి మనుషుల కథ. ఇలాంటి కంటెంట్ డ్రివెన్ మూవీస్ ను తెలుగు ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారని
తంగలాన్ కు పార్ 2 చేయాలని నేను పా రంజిత్, జ్ఞానవేల్ గారు అనుకున్నాం. తప్పకుండా ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది. ఒక్కటి కాదు వంద సీక్వెల్స్ చేయాలని అనుకుంటున్నామని
హీరో చియాన్ విక్రమ్ అన్నారు..
ఆయన నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్” ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా..నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. “తంగలాన్” సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చియాన్ విక్రమ్ మాట్లాడుతూ..
నేను శివపుత్రుడు చేసినప్పుడు ఈ సినిమా తెలుగులో ఆదరణ పొందుతుందా అని సందేహం వెలిబుచ్చారు కానీ తెలుగులో శివపుత్రుడు ఘన విజయాన్ని అందుకుంది. నేను చెప్పినట్లే “తంగలాన్”కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రాంతంలో ప్రేక్షకులు ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. పా రంజిత్ కు నాపై ఎంతో నమ్మకం ఉంది. ఆయన నమ్మకం వల్లే నేను తంగలాన్ చేయగలిగాను. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ కు తంగలాన్ పెద్ద హిట్ ఇచ్చింది. నెక్ట్ వచ్చే కంగువ రికార్డ్స్ బ్రేక్ చేసే మూవీ అవుతుంది. ఆయన మరో సినిమా కూడా రాబోతోంది. అది కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. నేను తెలుగు స్టేట్స్ లో ప్రమోషన్ కు వెళ్లినప్పుడు నా సినిమాలన్నీ చూశామని ఆడియెన్స్ చెప్పారు. ఓటీటీలో రిలీజైన నా సినిమాల గురించి కూడా వారు చెబుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మాళవిక ఆరతి పాత్రలో చాలా బాగా పర్ ఫార్మ్ చేసింది. జీవీ ప్రకాష్ హీరోగా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఫెంటాస్టిక్ జర్నీ చేస్తున్నారు. తంగలాన్ కు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ రోజు రెండు గొప్ప వార్తలు విన్నాను ఒకటి తంగలాన్ కు వస్తున్న మంచి కలెక్షన్స్, రెండవది పొన్నియన్ సెల్వన్ కు నాలుగు జాతీయ అవార్డ్స్ వచ్చాయని. ఈ రెండు చాలా హ్యాపీనెస్ ఇచ్చాయి. అన్నారు.
నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ ఎంతో కాంపిటేషన్ లో రిలీజైన మా సినిమాకు మంచి సక్సెస్ అందించారు తెలుగు ప్రేక్షకులు. తెలుగు స్ట్రైట్ సినిమాలు రిలీజైనా మా మూవీని ఆదరిస్తున్న తెలుగు ఆడియెన్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా సెట్ కు ఎక్కువగా వెళ్లలేదు. కానీ మేకింగ్ వీడియోస్ పంపినప్పుడు విక్రమ్ గారు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో అర్థమైంది. ఆయన మీద నాకున్న గౌరవం వంద రెట్లు పెరిగింది. దర్శకులు పెన్ లో ఇంక్ నింపి కథ రాస్తారు. మా దర్శకుడు పా రంజిత్ రక్తాన్ని నింపి కథ రాస్తారు. సినిమా మేకింగ్ లో ఆయన రాజీ పడరు. మాకు ఒక ఎపిక్ మూవీని ఇచ్చిన పా రంజిత్ బ్రదర్ కు థ్యాంక్స్. జీవీ ప్రకాష్ కుమార్ సినిమాను ఓన్ చేసుకుని మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకు జాతీయ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్ రావాలని కోరుకుంటున్నానన్నారు.
దర్శకుడు పా.రంజిత్ మాట్లాడుతూ “తంగలాన్” సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నేను రివ్యూస్ చదివాను, మా మూవీ గురించి మాట్లాడిన వారి మాటలు విన్నాను. అవన్నీ ఎంతో సంతోషాన్నిస్తున్నాయి. “తంగలాన్” ఒక డిస్కషన్ మొదలయ్యేలా చేసింది. సినిమా బిగినింగ్ ముందు విక్రమ్ గారి గురించి ఏవో రూమర్స్ నాకు చెప్పేవారు. కానీ ఆయన ఫస్ట్ డే షూట్ లోకి వచ్చినప్పుడు క్యారెక్టర్ కు కావాల్సినట్లు మారినప్పుడు నాకు చెప్పిన రూమర్స్ అన్నీ పూర్తిగా అబద్ధాలను తెలిసింది. చియాన్ విక్రమ్ గొప్ప నటుడు. దర్శకుడు కోరుకున్నట్లు నటిస్తాడు. ఆయన నటిస్తున్నప్పుడు మరింత బాగా మూవీ చేయాలనే బాధ్యత ఒత్తిడి దర్శకుడిగా నాపై పెరిగాయి. జ్ఞానవేల్ రాజా మాకు అందించిన సపోర్ట్ ను మాటల్లో చెప్పలేను. ఆయనకు మూవీ మేకింగ్ పట్ల ప్యాషన్ ఉంది. అందుకే తంగలాన్ లాంటి బిగ్ మూవీని ఎంతో ప్రెషర్ తీసుకుని అనుకున్నట్లుగా రిలీజ్ చేశారన్నారు. ప్రొడ్యూసర్ ధనుంజయన్, ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి , మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోయిన్ మాళవిక మోహనన్ , లిరిక్ రైటర్ భాస్కరభట్ల రవికుమార్, రైటర్ రాకేందు మౌళి తదితరులు మాట్లాడారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More