తెలుగు సినీ ప్రేక్షకులకు వైవిధ్యమైన సినిమాలను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్న నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్. ఈ బ్యానర్‌పై వచ్చిన బలగం ఎంత సెన్సేషనల్ సక్సెస్‌ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. లవ్ మీ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీ తర్వాత ఈ బ్యానర్‌పై వస్తోన్న చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ కోర్టు డ్రామా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. హీరోగా వరుస విజయాలను అందుకుంటున్న సుహాస్ మరోసారి ‘జనక అయితే గనక’ వంటి డిఫరెంట్ మూవీతో అలరించటానికి సిద్ధమవుతున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.