సహజసిధ్ధంగా సముద్రంలోలభించే గోమతిచక్రాలు జ్యోతిష్య ప్రాముఖ్యతను ఎందుకు పొందాయి వీటికి ఆ పేరు ఎందుకొచ్చింది. ఎలా ఏర్పడతాయి.. ఇవి మన దగ్గరుంటే మనకేంటి ఉపయోగం.. అసలు గోమతి చక్రాల విశిష్టత ఏంటి. చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి, తులా రాశిలోని స్వాతి నక్షత్ర సమయంలో సోడియం, కాల్షియం, లేదా కర్బనపు అణువుల సహాయంతో ఇవి రూపు దిద్దుకుంటాయి..ఈరెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం.ఈ శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాలు ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పతనాన్ని సంతరించుకున్నాయి గుజరాత్లోని ద్వారక సమీపంలోని గోమతితీరం లో లభించే ఇవి పూజార్హంగా మారాయి. గోమతి తీరం లో లభించేవి కనుక ఇవి గోమతి చక్రాలుగా పిలవబడి మన సమస్యల నివృత్తి కి ఇతోదికంగా తోడ్పడుతున్నాయి. గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది.దీనినే “నాగ చక్రం” అని “విష్ణు చక్రం” అని కూడ అంటారు. ఇది నత్త గుళ్ళ ని పోలి ఉంటుంది.అందువల్ల కొంతమంది దీనిని ‘స్నైల్ స్టోన్’ అని కూడ పిలుస్తుంటారు. ఇది మన కష్టాలను సుదర్శన చక్రం అడ్దేసినట్టుగా పోగోడుతుందని చాలా మంది విశ్వాసం. గోమతిచక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది.గోమతిచక్రం ముందుభాగం తెల్ల గాను,కొన్ని ఎర్ర గాను ఉంటాయి.తెల్ల గా ఉన్న గోమతిచక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి ఎర్రగా ఉన్న గోమతిచక్రాలు వశీకరణానికి, శత్రునాశనానికి, క్షుద్రప్రయోగాలకి,తాంత్రిక ప్రయోగాలకి మాత్రమే ఉపయోగించాలి.గోమతిచక్రాలలో ఆరు,తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి . సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్ర గ్రహానికి,తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి. జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ,సకల కార్యసిధ్ధికి,ఆరోగ్య సమస్యలకి,ధరించటానికి ఉపయోగపడతాయి. ప్రేమలో విఫలం కావటం ,వివాహాం అయిన తరువాత సంసార సుఖం పట్ల ఆసక్తిని కనబర్చకపోవటం వంటి దోషాలు సైతం గోమతిచక్ర నివారించబడతాయి. జ్యోతిష్యశాస్త్ర రీత్యా వీటిని ధరించిన వారికి ప్రేమ,దాంపత్య సౌఖ్యం,సౌభాగ్యాలకు కారణం అవుతుంది.. గోమతి చక్రాలను వియోగానికి ముందు పసుపు నీళ్ళతో శుద్ధి చేసి లలితా సహస్త్ర నామం జపిస్తూ కుంకుంతో గాని హానుమాన్ సింధూరంతో గాని అర్చన చేసి వీటిని వినియోగించుకోవాలి. ఈ పూజ శుక్రవారం గాని దీపావళి, వరలక్ష్మి వ్రతం నాడు చేసినా విశిష్ట ఫలితాలు లభిస్తాయి. అల పూజ నిర్వహించిన గోమతిచక్రాలను పూజామందిరంలో గాని బీరువాలో గాని ఉంచి మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి ఉపయోగించుకోవచ్చు. గోమతిచక్రాలను ఎప్పుడు ఎర్రని బట్టలో గాని,హనుమాన్ సింధూరంలో గాని ఉంచాలి.గోమతిచక్రాలను పిరమిడ్ లో గాని వెండి బాక్స్ లో గాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు ఉంచాలి. ఒక్క గోమతిచక్రాన్ని త్రాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోదక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలనుండి విముక్తి కలుగుతుంది.గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే నరదృష్టి భాదల నుండి విముక్తి కలుగుతుంది. అంతే కాకుండా సమస్యని బట్టి గోమతి చక్రాల సంఖ్య పెంచి సూచనల అనుసారం వినియోగిస్తే ఎన్నో సమస్యలు దూరం అవుతాయని పండితులు చెపుతున్నారు. అదే విధంగా జాతకచక్రంలో నాగదోషం,కాలసర్పదోషం ఉన్నవారు పంచమస్ధానంలో ఉన్న రాహువుకి పాపగ్రహాల దృష్టి గాని,సాంగత్యం గాని ఉన్నవారు కూడా గోమతి చక్రాలను పూజచేయటం గాని,దానం చేయటం, మెడలో లాకెట్ లాగా ధరించటం గాని చేయాలి అలాగే వ్యాపార సముదాయములలో ద్వార బందానికి కట్టి రాకపోకలు ఆద్వారం గుండా చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధి అవుతుందని కూడా చెప్తున్నారు.