సరిపోదా శనివారం లో హై రేంజ్ అడ్రినలిన్ పంపింగ్ మూమెంట్స్ వుంటాయని కథ ప్రకారం ఆ ఫీలింగ్ ని వందశాతానికి తీసుకెళ్ళామని హీరో నాని చెప్పారు..
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ప్రియాంక అరుల్ మోహన్ SJ సూర్య కాంబో లో డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న సరిపోదా శనివారం చిత్రం ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో నాని విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. కంటెంట్ సినిమాని చూసుకుంటుందనే ఫీలింగ్ వుండేది. నిజంగానే కంటెంట్ సినిమాని చూసుకుంటుంది. అయితే అది రిలీజ్ అయిన తర్వాత. రిలీజ్ కి ముందు పాజిటివిటీ, అందరికి రీచ్ చేయడం మన బాధ్యత. రెగ్యులర్ గా సినిమాని ఫాలోఅయ్యేవారికి సినిమా గురించి ఆటోమేటిక్ గా తెలుస్తుంది. అలాకాకుండా రెగ్యులర్ గా ఫాలోకాని వారు, పనుల్లో బిజీగా వున్నవారి దగ్గరకి మన సినిమా ఇన్ఫర్మేషన్, ఐడియా తీసుకువెళ్ళాలంటే అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేయాలి. ఆసక్తిని కలిగించాలి. సినిమా చుడాలనే థాట్ ని ట్రిగ్గర్ చేయడం చాలా పెద్ద పని అని అన్నారు.. ‘సరిపోదా శనివారం’లో ఛాలెజింగ్ అంటూ ఏమీ లేదు. చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. జనరల్ గా నా సినిమాలన్నిటిలో తెలియని ఒక బరువుని మోస్తుంటాను. అది ఈసారి ఎస్జే సూర్య గారిమీద, వివేక్ మీద వుంది. నేను కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నాను. పెర్ఫార్మెన్స్ పరంగా ఎస్జే సూర్య, ప్రియంక, మురళీశర్మ.. ఇలా అందరిపై భారం వుంది.
ఎస్జే సూర్య గారితో కలసి పెర్ఫార్మ్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఆయనకి చాలా అండర్ స్టాడింగ్ వుంటుంది. పెర్ఫార్మెన్స్ లో ఆయన నుంచి ఒక కొత్త పెర్స్పెక్టివ్ ని నేర్చుకోవచ్చు. ఆ రోల్ కి ఆయన తప్పితే మరో చాయిస్ లేదు. డబ్బింగ్ దాదాపు ఏడు రోజులు చెప్పారు. అద్భుతంగా వచ్చింది. తన డబ్బింగ్ కోసం మరో రెండుసార్లు సినిమా చూస్తారు.
ఈ చిత్రం రేసీ ఫిలిం. నెరేటివ్ కూడా రేసీగా వుంటుంది. సినిమా పరిగెడుతుంటుంది. ఇలాంటి పరిగెడుతున్న సినిమాకి ఏం స్కోర్ చేస్తాడనే ఒక క్యురియాసిటీని వుండేది. నిన్న వెళ్లి ఆర్ఆర్ చూశా. బేసిగ్గా సినిమాల్లో హీరోకి ఇంట్రో సాంగ్ వుంటుంది. తర్వాత మేలోడీలు, ఎమోషనల్ సాంగ్స్ వస్తాయి. అందులో బిట్స్ ని ఆర్ఆర్ గా పంప్ చేస్తుంటారు. కానీ జేక్స్.. మొత్తం సినిమాని హీరో ఇంట్రో సాంగ్ లా కొట్టాడు. తన మ్యాజిక్ 29న చూస్తారు.
అంటే సుందరానికీ చాలా మందికి ఫేవరేట్ సినిమా. ఆ జోనర్ ని ఇష్టపడే ఆడియన్స్ కి అది అల్ టైం ఫేవరేట్ లో ఒకటి. అయితే రిలీజైన రోజుల్లో ఆ సినిమా రన్ టైం, స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని కామెంట్స్ వినిపించాయి. అలాంటి సమయంలో ‘నేను సరిగ్గానే చేశానా?’ అనే డౌట్స్ తనలో ఉండేవి. భాద్యత తీసుకున్న వారికి ఇలాంటి డౌట్స్ వుండటం సహజం. అలాంటి సమయంలో తన బలాన్ని గుర్తు చేస్తూ నేను తన పక్కన ఒక బ్రదర్ లా వున్నాను. తను టెర్రిఫిక్ డైరెక్టర్. నిజంగా వేరే రాష్ట్రాలలో ఈవెంట్ కి వస్తున్న జనాలని చూస్తుంటే ఇలా ఎలా వస్తున్నారని సర్ ప్రైజింగ్ గా అనిపిస్తుంది. సినిమా సినిమాకి చాలా ఆదరణ పెరుగుతోంది. ఇది భాద్యతని మరింత పెంచుతోందన్నారు.