సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం లో రణబీర్ కపూర్, అలియా భట్ , విక్కీ కౌశల్ నటిస్తున్న లవ్ అండ్ వార్ సినిమా విశేషాల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల కోసం 2026 వరకు వెయిట్ చేయాల్సిందే.. రంజాన్, శ్రీరామనవమి మరియు గుడి పడ్వా వంటి ప్రధాన పండుగలు ఒకదాని వెంట ఒకటిగా రానుండడం వరుస సెలవులతో లాంగ్ హాలిడేస్ వుండటం.. వంటి కారణాలతో హాలీడే సీజన్‌లో ప్రేక్షకులు ఎక్కువ మంది ఈ చిత్రాన్ని ఆస్వాదించడానికి వీలుగా ఈ బిగ్ బడ్జెట్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 2026 మార్చి 20వ తేదీని ఈ చిత్ర విడుదల కోసం లాక్ చేసారు. దేశం జరుపుకుంటున్న ఫెస్టివల్స్ తో పాటు ఈ సినిమా కూడా పండుగ ఆనందాన్ని ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు.