ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ #Sharwa37 లో దియా గా సంయుక్త మేనన్

శర్వానంద్ 37వ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సామజవరగమనతో బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.
హిలేరియస్ రైడ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడిగా సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంయుక్త పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, పోస్టర్ ద్వారా ఆమె పాత్రను దియా గా పరిచయం చేశారు మేకర్స్. సంయుక్త సంప్రదాయ శాస్త్రీయ నృత్యం చేస్తూ కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ VS సినిమాటోగ్రఫర్. భాను బోగవరపు కథ అందించగా, నందు సావిరిగాన డైలాగ్స్ రాశారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. అజయ్ సుంకర సహ నిర్మాత, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

#BSS12 నుంచి సమీరగా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ #BSS12, ఆయన పరిశ్రమలోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపధ్యంలో మైల్ స్టోన్ మూవీగా హై బడ్జెట్, అత్యుత్తమ సాంకేతిక విలువలతో మ్యాసీవ్ స్కేల్ లో డెబ్యూటెంట్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం లో 400 ఏళ్ల నాటి గుడి నేపధ్యంలో థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త ఫీమేల్ లీడ్ లో నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ సంయుక్త పాత్రను సమీరాగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. గ్లాస్ షెల్ఫ్‌లపై రకరకాల నిర్మాణాలు కనిపిస్తుండగా, ఇంటెన్స్ లుక్స్ తో కూడిన మోడరన్ అమ్మాయి లుక్‌లో సంయుక్త అద్భుతంగా కనిపించింది.
శివేంద్ర కెమెరామ్యాన్ కాగా లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.

‘స్వయంభూ’ నుంచి వారియర్ గా…

నిఖిల్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభూ’. ఈ చిత్రంలో లెజండరీ వారియర్ గా కనిపించనున్నారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. విల్లు, బాణాలు పట్టుకుని వారియర్ గా కనిపించిన ఈ లుక్ సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హై బడ్జెట్, ఫస్ట్-క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో భారీ కాన్వాస్‌పై పీరియాడిక్ వార్ బ్యాక్‌డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీలో నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేష్ హీరోయిన్‌లు గా నటిస్తున్నారు..

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More