పాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో ప్రభాస్ ఏ సినిమా చేసిన అదో సంచలనమే హిట్టు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తు బాలీవుడ్ బడా హీరోలను కూడా చెమటలు పట్టిస్తున్నాయి. చివరకు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆది పురుష్ కూడా కలెక్షన్లు బాగానే రాబట్టింది. ఇప్పుడు ప్రభాస్ నుంచి వచ్చే సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదిలో రిలీజ్ కాబోతున్న సలార్ మూవీ పైన అందరి దృష్టి ఉంది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తర్వాత భారీ బడ్జెట్ తో నిర్మాత అశ్విని దత్ దర్శకుడు నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబో లో వస్తున్న ప్రాజెక్ట్ కే మూవీ పై కూడా మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలలో దిగ్గజ నటుడు కమలహాసన్, శృతిహాసన్ లు నటించడమే ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీసింది. సలార్ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుండగా, ప్రాజెక్ట్ కే మూవీ లో హీరో ప్రభాస్ ని ఎదుర్కొనే విలన్ క్యారెక్టర్ లో కమల్ హాసన్ కనిపించనున్నారు. ఇలా ప్రభాస్ వరుస సినిమాలలో ఈ తండ్రి కూతుళ్లు నటిస్తూ ఉండటమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సలార్ మూవీ టీజర్ జులై 7న రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. టీజర్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ సలార్ మూవీ షేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1000 కోట్లకు పైగా వసూలు చేసే దమ్ము ఈ సినిమాకు ఉందని పేర్కొంటున్నారు. అలాగే ప్రాజెక్ట్ కే సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. సీనియర్ హీరో కమల్ హాసన్ ప్రాజెక్ట్ కే సినిమాకు మరింత ప్లస్ కానున్నారనే తెలుస్తుంది. కచ్చితంగా ఈ సినిమా కూడా సలార్ మూవీ నుంచి హిట్ అవ్వడమే కాకుండా భారీ కలెక్షన్లు రాబట్టుకుంటుందనే విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ప్రభాస్ కెరీర్ కు మరింత దోహదపడతాయని, అతని ఇమేజ్ ను మరింతగా పెంచుతాయని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్ 29న సలార్ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.