పుష్ప-2 రిలీజ్ కి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 దిరూల్‌..!

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తకిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప-2’ ది రూల్‌.. డిసెంబరు 6న థియేటర్స్‌లో విడుదల కానున్న పుష్పరాజ్‌ రూల్‌ కు కౌంట్‌ స్టార్ట్ అయ్యింది. మరో 100 రోజుల్లో అంటే డిసెంబరు 6న పుష్ప-2 రూల్‌ బాక్సాఫీస్‌ పై ప్రారంభం కానుంది. ఇక రికార్డులు లెక్కపెట్టుకోవడమే అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు.. పుష్ప దిరైజ్‌తో బార్డర్‌లు దాటిన ఇమేజ్‌తో.. ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయని క్రేజ్‌తో దూసుకపోతున్న ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్ప-2’లో అద్వితీయమైన నటన కోసం, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ టేకింగ్‌..మేకింగ్‌.. కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నామని చెప్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ తో కలసి ప్రముఖ నిర్మాతలు, నవీన్ ఏర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు సాంగ్స్‌, టీజర్‌కు ఎంతటి అనూహ్యమైన స్పందన వచ్చిందో తెలిసిందే. ఇక పుష్ప-2 ది రూల్‌ నుండి రానున్న ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా అంతే క్రేజీతో రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో వున్న ఈ చిత్రం, మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. కంటెంట్‌ పరంగానే కాకుండా టెక్నికల్‌గా కూడా పుష్ప-2 అత్యున్నత స్థాయిలో వుండబోతుంది. మీరు ఎంత ఎక్స్‌పెక్ట్‌ చేసిన అంతకు మించి తగ్గేదేలేలా పుష్ప-2 వుండబోతుందని హింట్‌ ఇస్తున్నారు మేకర్స్‌… ఇక డిసెంబరు 6న అందరూ డబుల్‌ మార్క్‌ చేసుకొని రెడీ వుండడి.. అంటున్నారు మేకర్స్

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More