పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వినోదాయశీతం’ రీమేక్. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతానికి #PKSDT గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ‘దేవుడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇంతకుముందు ‘దేవర’ అనే టైటిల్ ని కూడా అనుకునున్నారు. జనసేనాని ని సినిమా పరంగా.. రాజకీయం పరంగా అభిమానులు ఒక హీరో లాగో ఒక నాయకుడు లాగో కన్నా ఒక దేవుడు గా భావిస్తుంటారు.. అభిమానులు అనుసరించే విధానాన్ని పవనిజం అనుకుంటూ దేవుడు గానే ట్రీట్ చేస్తుంటారు. అందుకే ఈ టైటిల్ కధా పరంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పరం గా ఇదే పర్ఫెక్ట్ యాప్ట్ అని మేకర్స్ భావిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదాయ శీతమ్ కు మూలకధ సముద్రఖని అందించారు. అయితే రీమేక్ విషయానికి వచ్చేసరికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సమూలంగా మార్పులు చేసి తన మార్కు డైలాగ్స్ సెట్ చేశారు.. నిజానికి ఈ ప్రాజెక్ట్ ని పవన్ కళ్యాణ్ తో సెట్ చేసిందే గురూజీ అని.. ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ తరువాత అంత భారీ రెమ్యునరేషన్ త్రివిక్రమ్ అందుకోనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. షూటింగ్ కు అంచెలంచెలుగా డేట్స్ కేటాయిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాను కేవలం సాయిధరమ్ తేజ్ కోసమే చేస్తున్నాడని వినికిడి గతంలో గోపాల..