ఓటీటీ ల ప్రాభవం పుంజుకున్న తరువాత ప్రతి సినిమా రెండుసార్లు ఫలితం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది.. థియేటర్స్ లో ఒకసారి ఓటీటీ లో ఒకసారి ఆడియన్స్ పల్స్ కోసం నిరీక్షించాల్సిందే.. ధియేటర్ లలో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన ఎన్నో సినిమాలు.. ఓటీటీ లో బొక్కబోర్లా పడ్డాయి.. ఇవి ఎలా హిట్ అయ్యాయిరా బాబు అని ఆడియన్స్ తలలు పట్టుకునేలా అవి ఫ్లాప్ అయ్యాయి.. అయితే లేటెస్టుగా డిజాస్టర్ ని మూట గట్టుకున్న విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” రీసెంట్ గా అమోజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఓటీటీ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని మంచి వ్యూస్ ని దక్కించుకుంటుంది. ప్రచారం జరిగినంత నెగెటివ్ ఈ సినిమాలో లేదని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నామంటూ పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ టైమ్ లో సినిమా మీద కొందరు చేసిన నెగిటివ్ ప్రచారం నిజమేననుకుని సినిమాను థియేటర్ లో చూడలేదని, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నామంటూ వాళ్లు ట్వీట్స్ చేస్తున్నారు. విజయ్, మృణాల్ ఫర్ ఫార్మెన్స్ బాగుందని, హీరో తన గురించి ఆలోచించుకోకుండా ఫ్యామిలీ కోసం నిలబడటం ఇన్ స్పైరింగ్ గా ఉందంటూ వారు పోస్ట్స్ చేస్తున్నారు. కొందరు కావాలని చేసిన నెగిటివ్ ప్రచారంలోనూ విజయ్ క్రేజ్ తో ఫ్యామిలీ స్టార్ సినిమా మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ తో ఆ దుష్ప్రచారం అంతా తేలిపోయింది. ఇండియాలోనే కాదు అమెరికాలోనూ ఫ్యామిలీ స్టార్ సినిమాను ప్రైమ్ వీడియోలో చూస్తున్నవారు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మిగతా సినిమాల్లాగే ఫ్యామిలీ స్టార్ లోనూ కొన్ని మిస్టేక్స్ ఉన్నా సినిమా అన్ని అంశాల్లో బాగుందని చెబుతున్నారు. ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రెస్పాన్స్ తో సోషల్ మీడియా నెగిటివ్ ప్రాపగండా నమ్మొద్దనే రియలైజేషన్ ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఇది విజయ్ దేవరకొండ నెక్ట్ సినిమాలకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.