దర్శకుడు ఓం రౌత్ పై ప్రేక్షకుల ఆగ్రహం

దర్శకుడు ఓం రౌత్ అనుభవ రాహిత్యం ఏంటో పురుష్ రిజల్ట్ చెప్తుంది.. కోట్లాదిమంది భారతీయుల సెంటిమెంట్ అయిన రామాయణ గాధ ను తనకు నచ్చినట్టుగా మార్చి మోడ్రన్ రామాయణం అంటూ అది పురుష్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. తీరా మూవీ చూశాక భారతీయుల సెంటిమెంటును ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాను ఇష్టానుసారంగా తీయడమే ఇప్పుడు ప్రేక్షకులకు ఆగ్రహాన్ని తెప్పించింది. సినిమా రిలీజ్ ముందు వరకు సపోర్ట్ చేసిన హిందుత్వవాదులు సినిమా రిలీజ్ అయ్యాక దర్శకుడు ఓం రౌత్ సినిమా తీసిన విధానం పై మండిపడుతున్నారు. అయితే ఒక వర్గం మాత్రం మొదటి నుంచి ఈ సినిమా భారీ డిజాస్టర్ కావాలని కోరుకుంటుంది. బాలీవుడ్ లో ఖాన్ త్రయానికి అడ్డొచ్చిన ప్రభాస్ మూవీలు ఏవి కూడా ఇక్కడ ఆడకూడదని భీష్మించి కూర్చున్నారు. వారు అనుకున్నట్లుగానే జరిగింది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కావాలని డిజాస్టర్ మూవీ తీసాడంటూ ఇప్పటికే ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ సినిమా బాగుందని ఎంత లేపడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ సినిమా సాధారణ ప్రేక్షకుడు ఊహించిన స్థాయిలో లేకపోవడం సినిమా రిజల్ట్ పై మరింత ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ ఈ సినిమాకు అంగీకరించకుండా ఉంటే బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు. పౌరాణిక, జానపద చిత్రాల తీయాలంటే అది దక్షిణాది డైరెక్టర్స్ మాత్రమే సాధ్యమని గతంలో తీసిన చలన చిత్రాలు రూడీ చేస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ జమానాలో సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు లు ఎక్కువగా ఈ తరహా చిత్రాలు చేశారు. వీరి ముగ్గురిలో సీనియర్ ఎన్టీఆర్ కు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. అది ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే హిందీలో 80వ దశకంలో వచ్చిన రామానంద సాగర్ రామాయణం టీవీ సీరియల్ మాత్రం అందరిని ఆకట్టుకుందనే చెప్పాలి. రామాయణ చరిత్రతో వచ్చిన కథ సినిమాలో అన్ని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కానీ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ మోడ్రన్ రామాయణం అంటూ నచ్చినట్టుగా సినిమా తీసి జనాల మీదకు వదిలేసాడు. బాహుబలి 2 విజయం తర్వాత ప్రభాస్ కు సాహో, రాదే శ్యామ్ డిజాస్టర్ లు వచ్చాయి. ఇప్పుడు ఆది పురుష్ సినిమా కూడా ఆ జాబితాలోకి చేరే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఆది పురుష్ మూవీ రిజల్ట్ చూసి కొంతమంది సంబరాలు చేసుకుంటుండగా ఇకమీదట బాలీవుడ్ దర్శకులతో పని చేయొద్దంటూ ప్రభాస్ కు అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాహో, రాధే శ్యామ్ ప్లాప్ మూవీలుగా మిగిలినప్పటికీ నిర్మాణ పరంగా ను, టేకింగ్ విషయంలోనూ, గ్రాఫిక్స్ విషయంలోనూ, ప్రభాస్ లుక్ విషయంలోనూ ఎటువంటి విమర్శలు రాలేదు. కానీ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ మాత్రం ప్రభాస్ లుక్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. రామాయణం అందరికి తెలిసిన కథ అయినప్పటికీ దానిని తనకు నచ్చినట్టుగా మార్పులు చేర్పులు చేసి జనాల మీదకు వదిలేసాడు. సినిమాలో ప్రతి ఒక్కరు తమ క్యారెక్టర్ కు తగిన న్యాయం చేశారనే చెప్పాలి. ముఖ్యంగా హనుమంతునిగా చేసిన దేవదత్త కు ప్రశంసలు వస్తున్నాయి. హనుమంతుని గెటప్ కూడా విమర్శల పాలయ్యింది. రావణాసురుడు గెటప్, రాముడు గెటప్ అసలు జనాలకు నచ్చలేదు. అందరికీ నచ్చే విధంగా సినిమా తీయాలి. తనకు నచ్చినట్టుగా సినిమా చేస్తాను అంటే ఇలాగే ఉంటుంది. ఈ సినిమా రిజల్ట్ తో ప్రభాస్ రేంజ్ పడిపోయిందని నార్త్ లో కొందరు యాంటీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈసారి మాత్రం ప్రభాస్ తన వచ్చే సినిమాతో కచ్చితంగా అందరికీ సరైన సమాధానం చెప్తాడని అభిమానులు డంకా బజాయిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ మూవీ గా ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబోలో వస్తున్న సలార్ మూవీ ఈసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More