ఆర్ఎక్స్ 100 తో యూత్ హృదయాలను ఓ గిల్లు గిల్లిన పాయల్ రాజ్ పుత్ తనకు ఇండస్ట్రీలో బ్రేక్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి తో మళ్ళీ కలసి పనిచేస్తోంది.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా తో కవ్వించబోతోంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, లతో కలసి A’ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అజయ్ భూపతి స్వీయ నిర్మాణం లో మంగళవారం అనే భిన్నమైన టైటిల్ తో సినిమాలోని పాయల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కళ్ళల్లో కన్నీరుతో. నగ్నంగా ఎమోషనల్ అండ్ బోల్డ్ లుక్ తో ఫస్ట్ లుక్ అదరగొట్టింది. ”గ్రామీణ నేపథ్యంలో 1990వ దశకంలో సాగే కథతో నేటివిటీకి దగ్గరగా తీస్తున్న డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. రా అండ్ రస్టిక్ మూవీ అని దర్శకుడు అజయ్ భూపతి చెప్తున్నారు.. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తు ఉండేలా పాయల్ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశానని ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్ సినిమా అంటున్నారు మేకర్స్ ‘ఆర్ఎక్స్ 100’లో ఇందు పాత్ర ప్రేక్షకులకు ఎలా గుర్తు ఉండిపోతుందో, ఇప్పుడీ ‘మంగళవారం’లో శైలజ పాత్ర కూడా అలాగే గుర్తు ఉంటుందని చెప్తున్నారు.