యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన “భజే వాయు వేగం” సినిమా గత నెల 31న థియేటర్స్ లో రిలీజై సూపర్ హిట్ అయి ఈ నెల 28వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ వర్క్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రాబోతొందన్న విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా హీరో కార్తికేయ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ – థియేటర్స్ లో మా “భజే వాయు వేగం” సినిమాకు ప్రేక్షకులంతా తమ ప్రేమను అందించారు. అదే ప్రేమను మేము నెట్ ఫ్లిక్స్ ద్వారా మీ ఇంటికే వచ్చి తిరిగి ఇవ్వబోతున్నాం. అని ట్వీట్ చేశారు. “భజే వాయు వేగం” సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. థియేటర్స్ లో అందుకున్న విజయానికి మించిన సక్సెస్ నెట్ ఫ్లిక్స్ లోనూ “భజే వాయు వేగం” అందుకుంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.