ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్‌, చిత్రం లాంఛ‌నంగా ప్రారంభం..

జ‌న‌వ‌రి 9, 2026 వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్

క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ఎన్టీఆర్ బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. కెజియ‌ఫ్‌, స‌లార్ చిత్రాల త‌ర్వాత నీల్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ఎన్టీఆర్ నీల్ అనే వ‌ర్కింగ్ టైటిల్‌ తో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు.


ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల‌తో పాటు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్, ప‌లువురు సినీ ప్ర‌ములు హాజ‌ర‌య్యారు. అభిమానుల‌కు ఆనందాన్నిచ్చేలా ‘ఎన్టీఆర్ నీల్’ ప్రాజెక్ట్‌ను జనవరి 9, 2026లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. బ్లాక్ బ‌స్ట‌ర్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో మెప్పించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ వంటి మ్యాన్ ఆఫ్ మాసెస్‌ను నెక్ట్స్ రేంజ్లో ప్రొజెక్ట్ చేస్తార‌న‌టంలో సందేహం లేదు. ఈ విష‌యం ఫ్యాన్స్‌లో మ‌రింత ఆస‌క్తిని పెంపొందిస్తోంది.

ఇండియ‌న్ సినీ హిస్టరీ ఈ మూవీ సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంద‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమా రూపొంద‌నుంది. ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబో మూవీ అంటే అభిమానుల్లో, ప్రేక్ష‌కుల్లో ఎలాంటి అంచ‌నాలుంటాయో, ఆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా ఎన్టీఆర్‌నీల్ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించి, కెజియ‌ఫ్ త‌ర‌హా ఓ స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌నున్నారు మేక‌ర్స్.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More