వరుస చిత్రాలతో ఎన్టీఆర్ ఫుల్ బిజీ…

ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్. రీసెంట్ హిట్ దేవర తో నేషనల్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ఐదు వందల కోట్ల కు పైనే కలెక్షన్స్ సాధించి క్లోజింగ్ దిశ గా వెళ్తోంది. దీంతో ఫుల్ ఖుషిగా ఉన్న ఎన్టీఆర్ నెక్స్ట్ మూడు సినిమాలు చేసేందుకు తన డైరీని ఫుల్ చేసేశాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో ఎవరైనా క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి. డిమాండ్ ఉన్నప్పుడే వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోవాలి. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు ఎన్టీఆర్. ఏడాదికి ఓ సినిమా రిలీజ్ చేసేలా తన డైరీ ని సెట్ చేసేశాడు. నిజానికి దేవర సెట్స్ పై ఉన్నప్పుడే హృతిక్ తో వార్ 2 స్టార్ట్ చేశాడు ఎన్టీఆర్. ఇప్పటికే 70% షూటింగ్ పూర్తయింది. 2025 ఆగస్టులో ఆడియన్స్ ముందుకు రానుంది. వార్2 లో తన పోర్షన్ పూర్తి చేసి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయనున్నాడు తారక్.

2026 సంక్రాంతి కి డ్రాగన్ రిలీజ్ అని ముందే ప్రకటించారు. అంటే వచ్చే ఏడాది అక్టోబర్ లోగా షూటింగ్ పూర్తి చేయాలి. ఆపై దేవర 2 షూటింగ్ మొదలవుతుంది.. ఇవి పూర్తికాకుండానే తారక్ కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్ల లిస్ట్ పెరిగిపోతోంది.ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ప్రయాత్నలు చేస్తున్నాడు వెట్రిమారన్. రీసెంట్ గా తారక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కాంబోలో సినిమా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే వెట్రిమారన్ ప్రజెంట్ విడుదల పార్ట్ 2 చేస్తున్నాడు. తర్వాత సూర్య తో వడివాసల్ పూర్తి చేయాల్సి ఉంది.ఇక జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా యంగ్ టైగర్ కోసం ఓ కథ సిద్ధం చేశాడట.రీసెంట్ గా లైన్ కూడా చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. రజనీకాంత్ తో జైలర్ 2 చేయడం ఆలస్యం అయితే ఈ ప్రాజెక్ట్ పై వర్క్ చేయాలని చూస్తున్నాడట. మొత్తానికి తారక్ డైరీ కమింగ్ త్రీ ఇయర్స్ డేట్స్ తో నిండిపోయింది. 2024 దేవర, 2025 వార్ 2, 2026 ప్రశాంత్ నీల్, 2027 దేవర 2 సినిమాలు రిలీజ్ చేసేలా పక్క ప్లాన్ ఫిక్స్ అయింది.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More