టాలీవుడ్ కి రీ రిలీజ్ లు కొత్తేం కాదు.. ప్రతి సినీమా ఎక్కడో ఓ చోట ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తూనే వుంటుంది.. అయితే విడుదలైన థియేటర్ల వరకు దాని ప్రచారం పరిమితమై వుంటుంది.. అయితే ఇటీవల వచ్చిన అనూహ్యమైన మార్పు ఏంటంటే కొన్ని చిత్రాలను ఓన్లీ స్మాల్ స్క్రీన్ పై మాత్రమే చూసిన ప్రెజెంట్ జనరేషన్ బిగ్ స్క్రీన్ లపై ఆ చిత్రాలను చూసి ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో అలనాటి కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలకు 4k సాంకేతికత జోడించి గ్రాండ్ పబ్లిసిటీ తో రిలీజ్ చెయ్యడంతో కొత్త సినిమాలతో పోటీ పడి మరీ కలెక్షన్స్ వసూలు చేస్తున్న సందర్భాలు వున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన నాటి క్లాసిక్ మురారి సరికొత్త రికార్డు నీ క్రియేట్ చేసింది.. క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ తెలుగింటి వాకిలికి కట్టిన మామిడి తోరణం లాంటి సినిమా మురారి విడుదలకు ముందే కోటిరూపాయిలకు పైగా టిక్కెట్లు బుక్ అయి చిత్రం స్టామినా ఏంటో నిరూపించుకుంది.. రిలీజ్ అయిన అన్ని ధియేటర్లలో యూత్ పెద్ద ఎత్తున మూవీ చూసి పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసారు.. 30అడుగుల కట్ఔట్ తో న్యూ రిలీజ్నీ మైమరపింప చేసారు. క్రాకర్స్ కాల్చి హోరెత్తించారు. దిల్షుక్ నగర్ లోని గంగా ధియేటర్లో ఓ జంట వివాహం చేసుకుని మరీ మురారీ సినిమాకి కొత్త కితాబు నిచ్చారు.. ప్రేక్షకులే పెళ్లి పెద్దలై ఆశీర్వదించారు.. ఇరవై మూడేళ్ల తరువాత కూడా సినీమా కి ఇంతలా బ్రహ్మా రథం పట్టడం గొప్ప విషయం కాక మరింకేంటి.. ఈ క్రెడిట్ మహేష్ బాబు తో దర్శకుడు కృష్ణ వంశీ కి మాత్రమే చెందుతుంది.