నాన్ ఇంగ్లీష్ కేటగిరిలో’ అవార్డు మిస్ అయిన ఆర్ ఆర్ ఆర్

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’లో బెస్ట్ మోషన్ పిక్చర్-నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ని ఆర్.ఆర్.ఆర్ మూవీ జస్ట్ లో మిస్ అయింది.ఈ అవార్డు ఖచ్చితంగా వస్తుందని మూవీ టీమ్ ఆశించింది. ఈ అవార్డుకు పోటీ కూడా ఎక్కువ వుంది. ఆయినప్పటికి ఈ కేటగిరిలో అవార్డు కొట్టడం ఖాయమని అభిమానులు కూడా బాగా హోప్స్ పెట్టుకున్నారు. కానీ చివరి నిమిషంలో బెస్ట్ మోషన్ పిక్చర్-నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ని ‘అర్జెంటినా 1985’ అనే స్పానిష్ ఫిల్మ్ గెలుచుకుంది. 1985లో జరిగిన ‘ట్రైల్ ఆఫ్ జుంటాస్’ అనే ఒరిజినల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకోని తెరకెక్కిన ‘అర్జెంటినా 1985’ ప్రపంచవ్యాప్త సినీ అభిమానులని మెప్పిస్తోంది. 2022లో వరల్డ్ ఫిల్మోగ్రఫిలోని టాప్ 5 ఇంటర్నేషనల్ మూవీస్ లిస్టులో ‘అర్జెంటినా 1985’కి కూడా చోటు ఇచ్చింది ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ’. ఇప్పటివరకూ బెస్ట్ మోషన్ పిక్చర్ కేటగిరిలో పది అవార్డ్స్ ఈవెంట్ లో ఇతర సినిమాలతో పోటీ పడిన ‘అర్జెంటినా 1985′ అందులో 7 సార్లు బెస్ట్ పిక్చర్ అవార్డుని గెలుచుకుంది. బెస్ట్ మోషన్ పిక్చర్-నాన్ ఇంగ్లీష్ కేటగిరిలో’ కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా అవార్డు గెలవకపోయిన బెస్ట్ సాంగ్ కేటగిరిలో మాత్రం ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ అవార్డు ను సాధించి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. బెస్ట్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ గెలుచుకుందనే విషయం తెలియగానే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ప్రౌడ్ మూమెంట్ ఇండియన్ సినిమా హిస్టరీలో గోల్డెన్ వర్డ్స్ తో ఇన్స్క్రైబ్ చెయ్యాల్సినంత గొప్పది. ఫైనల్ ఆస్కార్ అవార్డు లలో మాత్రం ఆర్.ఆర్.ఆర్ టీమ్ ఈ రెండు కేటగిరిలలో ఇతర చిత్రాలతో పోటీపడుతుంది. 95వ ఆస్కార్ అకాడెమీ అవార్డ్స్ లో కూడా ‘అర్జెంటినా 1985’ బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ కేటగిరిలో పోటి చేస్తుంది. దాదాపు ఈ మూవీనే ఆస్కార్ గెలుస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ భారతీయ అభిమానులు మాత్రం ఆర్.ఆర్.ఆర్ మూవీ రెండు కేటగిరీలలో కూడా ఆస్కార్ అవార్డులు సాధించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More