ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి బాలయ్య. ఎవరికి భయపడని తత్వం అతనిది. తాను చెప్పాలనుకున్న విషయం ముఖం మీదే చెప్పేస్తాడు. అందుకే చాలామంది బాలకృష్ణ తో మాట్లాడాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మరొకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఎంత స్టార్ డం ఉన్నప్పటికీ సింపుల్ గా ఉండే వ్యక్తి. అందరితో కలిసిపోతూ అందరి మనసుల్లో మా రామ్ చరణ్ అనుకునేంతలా అందరివాడయ్యాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఆశ్చర్యంతో పాటు అబ్బురుపరిచే విధంగా ఉంది. దశాబ్దాలుగా నందమూరి- మెగా హీరోల సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ నడుస్తూనే ఉంది. బాలకృష్ణ చేసిన అన్ స్టాపబుల్ కార్యక్రమం వీరిద్దరిని కలిపిందనే చెప్పవచ్చు. అంతకుముందే వీరి మధ్య బాగా పరిచయం ఉన్నప్పటికీ అన్ స్టాపబుల్ వీరిద్దరిని చాలా దగ్గర చేసింది. ఎంతలా అంటే నందమూరి బాలకృష్ణ ఏ కార్యక్రమం చేసిన తప్పకుండా రామ్ చరణ్ ను పిలవాలి అనేంతలా. హైదరాబాదులో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో రామ్ చరణ్ కు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి బాలయ్యకు అతనిపై ప్రత్యేక అభిమానం ఉన్నట్టు తెలియ వస్తుంది. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కనే రామ్ చరణ్ కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు తను కూర్చోవలసిన ప్లేస్ అది కాదు అంటూ పైకి లేవబోతుంటే బాలయ్య కలుగజేసుకొని పర్లేదు కూర్చో అన్నట్లుగా రామ్ చరణ్ భుజంపై చేయి వేసి కుర్చీలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇదే విషయం మెగా- నందమూరి అభిమానుల మధ్య చర్చ కొనసాగుతుంది. ఈ హీరోల మధ్య సినిమాల పరంగా పోటీ ఉన్నప్పటికీ ఏదైనా కార్యక్రమం అయినప్పుడు ఒక కుటుంబంలా కలిసిపోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు కావలసి ఉంది. కొన్ని అనివార్య కారణాలవల్ల అతను రాలేకపోయారు. అలాగని రామ్ చరణ్ కు ఎక్కడ అసౌకర్యం కలగకుండా అతనిని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని కూడా రామ్ చరణ్ తెలియచేయడం జరిగింది. తన ఆరేళ్ల వయసులో ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కొడుకుతో తన ఫ్రెండ్షిప్ ఉండేదని, సమయంలో అతను తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడే సీనియర్ ఎన్టీఆర్ గారిని చూడడం జరిగిందని, తనని ఎంతో ఆప్యాయంగా పలకరించారని, తనపట్ల అభిమానాన్ని చూపారని రామ్ చరణ్ చెప్పుకోచ్చారు. మెగా హీరోలలో రామ్ చరణ్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఎవరితో అయిన సరే కలిసిపోయి వారిని తన కుటుంబ సభ్యులు చూసుకోవడంలో అతనికి అతనే సాటి. అందుకే బాలకృష్ణకు కూడా రామ్ చరణ్ అంటే ప్రత్యేక అభిమానం ఏర్పడింది. వీరిద్దరి బాండింగ్ పై ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కూడా చర్చ జరుగుతుంది. తెలుగు హీరోలందరూ అలా కలిసిమెలిసి ఉంటే చూసేందుకు చాలా సంతోషంగా ఉందని చాలామంది అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.