ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ హీరో హీరోయిన్లు గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రాజేష్ చికిలే దర్శకత్వంలో యం.బంగార్రాజు నిర్మిస్తోన్న చిత్రం ‘మధురం’. ఎ మెమొరబుల్ లవ్ అన్న టాగ్లైన్ తో టీనేజ్ ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని .. సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రం టీజర్ ను రెటిరో స్టార్ నితిన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో ఉదయ్ రాజ్, దర్శకుడు రాజేష్ చికిలే, నిర్మాత బంగార్రాజు, ప్రొడక్షన్ మేనేజర్స్ వర్మ, టోనీ పాల్గొన్నారు. అనంతరం రెటిరో స్టార్ నితిన్ మాట్లాడుతూ. టీజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. డెఫినెట్ గా మంచి హిట్ అవుతుంది. స్వీట్, ఇన్నోసెంట్, జెన్యూన్ గా వుంది. చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీలా వుంది. ఈ సినిమా హిట్ అయి టీం అందరికీ మంచి బ్రేక్ రావాలన్నారు.. .