నాగార్జున రిలీజ్ చేసిన ‘బహిష్కరణ’ ట్రైల‌ర్‌

యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్‌ను గమనిస్తే.. మంచోడు చేసే త‌ప్పేంటో తెలుసా.. చెడ్డోడి చ‌రిత్ర గురించి తెలుసుకోవ‌టం అనే డైలాగ్‌తో ప్రారంభ‌మైంది. ఓ వైపు ప‌చ్చ‌టి ప‌ల్లెటూరు, అక్క‌డ అంజ‌లి, శ్రీతేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల పాత్రల మ‌ధ్య స‌న్నివేశాల‌ను అందంగా చూపిస్తూనే, ప‌ల్లెటూరులో ఊరి పెద్ద‌, అత‌ని మ‌నుషులు చేసే దురాగ‌తాల‌ను చూపించారు.. అలాంటి ప‌ల్లెటూర్లోకి పుష్ప అనే అమ్మాయి వ‌స్తుంది. ఆమె వ‌చ్చిన త‌ర్వాత అక్క‌డి పరిస్థితులు మారుతాయి. ఇంత‌కీ పుష్ప అక్క‌డికెందుకు వ‌చ్చింది.. ఊరి పెద్ద‌తో ఆమెకున్న రిలేష‌న్ ఏంటి? అమ్మాయిల‌ను ఆట‌వ‌స్తువులుగా చూసింది ఎవ‌రు? ఇలాంటి ఎన్నెన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం బ‌హిష్క‌ర‌ణ సీరీస్‌.
అంజ‌లి పాత్ర‌ను గ‌మనిస్తే.. ఓ వైపు ప్రేమ కురిపిస్తూనే మ‌రో వైపు ఆగ్ర‌హావేశంతో ఊగిపోయే ఆమె పాత్ర‌ను చూస్తుంటే ఆమె పోషించిన పాత్ర‌లోని భావోద్వేగాలు ఎంత లోతుల్లో ఉన్నాయో అర్థ‌మ‌వుతుంది. శ్రీతేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల పాత్ర‌ల‌తో పాటు ఊరి పెద్ద పాత్ర‌లో ర‌వీంద్ర‌న్ విజ‌య్‌ను చూడొచ్చు. ప్ర‌శాంతంగా ఉండే ఆ ప‌ల్లెటూరుకి అమ్మాయి ఎందుకు వ‌చ్చింది.. ఆమెకు అక్క‌డ ఎదురైన ప‌రిస్థితులేంటి? ఆమె ఎవ‌రిపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకుంది.. ఎందుకు? అనే విష‌యాలు తెలియాలంటే జూలై 19న ZEE 5లో స్ట్రీమింగ్ కానున్న‌ ‘బహిష్కరణ’ సిరీస్ చూడాల్సిందే.


ఈ సిరీస్‌కు ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More