‘కల్కి 2898 AD’ పార్ట్‌ 2 కోసం 20 రోజులు షూట్ ఫినిష్ చేశాం

  • డైరెక్టర్ నాగ్ అశ్విన్

ఒక్క సినిమాగానే కల్కి కథను తెరకెక్కించాలనుకుని కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంత పెద్ద స్టోరీని ఒక్క భాగంలో చెప్పడం ఛాలెంజ్ అనిపించడం తో అప్పుడే పార్ట్‌లుగా చూపించాలని నిర్ణయించుకున్నామని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలిపారు.. కల్కి 2898 AD’ విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ శంకరపల్లిలోని కల్కి సెట్స్ లో జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో ‘కల్కి 2898 AD’ విశేషాలని వివరిస్తూ పార్ట్‌ 2కి సంబంధించిన 20 రోజులు షూట్ చేశాం. ఇంకా చాలా చేయాలి, చాలా యాక్షన్, బ్యాక్ స్టోరీస్, న్యూ వరల్డ్స్ ఇలా చూడటానికి చాలా వున్నాయి. అవన్నీ ఇప్పుడు క్రియేట్ చేయాలన్నారు.. భారతం, భాగవతంలోని ఇన్సిడెంట్స్ లో కల్కి లో అడాప్ట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ
తెలుగు సినిమా అంటే మనకి గుర్తుకొచ్చేది మాయాబజార్. మాయాబజార్ మహా భారతానికి ఒక అడాప్ట్టేషన్. ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్స్ మహాభారతంలో ఎక్కడా లేదు. అదొక క్రియేటివ్ ఫిక్షన్. అక్కడి నుంచే ఇన్స్పిరేషన్ వచ్చిందనే చెప్పారు.. మా ప్రోడుసర్స్ రిస్క్ తీసుకున్నారు. ఇంత ఖర్చు చేయాలంటే.. దానికంటే ఎక్కువ ఖర్చు పెడతారు. కథ, పాత్రలకు న్యాయం చేయలనే ఉద్దేశంతోనే అమితాబ్, కమల్, ప్రభాస్, దీపిక లాంటి పెద్ద యాక్టర్స్ ని తీసుకోవడం జరిగిందన్నారు.
కల్కి మ్యాసీవ్ సబ్జెక్ట్, వరల్డ్ బిల్డింగ్, చాలా క్యారెక్టర్స్ వుంటాయి. ఇవన్నీ చూపించాలి. ఇప్పుడు వరల్డ్ బిల్డింగ్ అయిపొయింది. ఆడియన్స్ కి ఆ వరల్డ్ పరిచయమైయింది. ఎవరి పాత్రలు, పవర్స్, మోటివ్స్ ఏమిటో తెలిసింది. ఇకపై ఇంకా ఫన్ గా వుంటుంది. కర్ణుడి పాత్ర పాజిటివ్ గానే వుంటుంది. ఇండియాలో ఎక్కడ చూసిన ఆ క్యారెక్టర్ ని లవ్ చేస్తారు. ఆయన కథకి క్యారెక్టర్ కి జస్టిస్ చేయాలనే వుంటుంది. కల్కిని రెండో సారి చూస్తునప్పుడు కర్ణుడికి సంబధించిన చాలా విషయాలు కొత్తగా కనిపిస్తాయి. సెకండ్ టైం చూసినప్పుడు డిఫరెంట్ ఫిల్మ్ అనిపిస్తుంది. సెకండ్ టైం వర్త్ వాచ్ మూవీ ఇది. పిల్లలు మహాభారతం, మన ఒరిజినల్ హీరోస్ కి సంబధించిన విషయాలు తెలుసుకుంటారనే ఒక ఉద్దేశం అయితే వుంది. మనకి అద్భుతమైన స్టొరీలు వున్నాయి. అందుకే సినిమాని మరీ డార్క్ కాకుండా లైట్ హార్ట్టెడ్ గా తీయడం జరిగింది.
ఒక సినిమాని నాలుగున్నరేళ్ళు దాక పట్టుకొని ఉండాలంటే జడ్జ్మెంట్ వుండాలి, 2019లో రాసిన సీన్ 2024 లో ఎడిట్ చేసుస్తున్నపుడు అదే జడ్జ్మెంట్ పెట్టుకోవడం కష్టమైన విషయం. దీనికి డిఫరెంట్ స్కిల్ సెట్ కావాలి. ఈ సినిమా విషయంలో ఇది కష్టమనిపించింది. వైజయంతీ మూవీస్ 50 ఏళ్ల జర్నీలోనే కాదు.. తెలుగు సినిమా హిస్టరీలోనే ఇది వన్ అఫ్ ది మోస్ట్ ఎక్స్ పెన్స్సీవ్ ఫిల్మ్. ఈ సినిమా గొప్ప సక్సెస్ సాధించి మా ఇన్వెస్ట్ మెంట్ ఫుల్ గా రావడం అనేది చాలా థాంక్ ఫుల్ గా భావిస్తున్నాను. సెట్స్ విషయంలో మా ప్రొడక్షన్ టీం చాలా కష్టపడింది. ఇందులో నాకు ఇష్టమైన ప్లేస్ శంభల స్టెప్స్. అక్కడే కూర్చునే వాడిని. అక్కడ సైన్ రైజ్ సన్ సెట్ చాలా బావుంటుందని చెప్పారు..
రాజమౌళి, ఆర్జీవి గారు ఫ్యూర్లీ ఎ ట్రీబ్యుట్. ఇండస్ట్రీని చేంజ్ చేసిన డైరెక్టర్స్. ఆర్జీవి గారు నేను ఎందుకు ? అని అడిగారు. కలియుగంలో మీరు ఉంటారని చెప్పాను అలాగే బుజ్జిని డిజైన్ చేయడానికి ఏకంగా అటోముబైల్ ఇంజనీరింగే చేశామని. పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నాం. టెంపరరీ లైసెన్స్ కూడా ఇచ్చారని నాగ్ అశ్విన్ తెలిపారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More