ఆంజనేయస్వామి కి సంకెళ్ళు(బేడీలు) ఎందుకు..?

నేరం చేసిన వారిని, నిందితులుగా ఋజువై శిక్ష పడ్డ వారిని పోలీసులు సంకెళ్లు వేసి తీసుకు వెళ్తుంటారు… చట్టప్రకారం తీసుకునే ఒక చర్య. ఇది ఇప్పటిది కాదు… కానీ పురాణకాలంలో హనుమంతుడు ఎం నేరం చేసాడని బేడీలు వేసి అక్కడ విగ్రహరూపం లో ఉంచారు.. తిరుమల శ్రీవారి ఎదురుగా ఈ బేడీ ఆంజనేయ స్వామి అక్కడే పూజలు ఎందుకు అందుకుంటున్నారు..? దీనివెనుక ఉన్న పురాణ ప్రాధాన్యత ఏంటి..?వివాదాస్పద అంశమే అయినా కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి లోని జాపాలి పుణ్య క్షేత్రం.. సప్త గిరులలో ఒకటైన అంజనాద్రి లో తపస్సు చేసిన అంజనదేవి వాయుదేవుని వరప్రభావ కారణంగా హనుమంతునికి ఇక్కడే జన్మనిచ్చినట్లు కొంతమంది చరిత్ర కారులు చెపుతుంటారు.. ఈ అంశం ఇప్పుడు వివాదాస్పదమైనప్పటికి బేడీ ఆంజనేయ స్వామి గురించి చెప్పాల్సి వచ్చేటప్పుడు కచ్చితంగా గా ఇది ప్రస్తావించాల్సిందే.. ఇక బాల్యంలో ఉన్న హనుమంతుడు తిరుమలలో వీధులలో అల్లరి చేస్తుంటే ఆయన తల్లి అంజనాదేవి కాళ్ళకు బేడీలను కట్టి శ్రీవారి ముందు నిలబెట్టి స్వామి మీరే ఆంజనేయుడిని చూసుకోవాలని కూడా అంజనాదేవి శ్రీవారిని ప్రార్థించిందని పండితులు చెబుతున్నారు..

అలాగే ఒకసారి ఒంటె పై వెళతానని తన తల్లి అంజనా దేవి వద్ద ఎక్కువ అల్లరి చేస్తుంటే అంజనీ దేవి హనుమంతుడిని బేడీలతో బంధించి తాను వచ్చే వరకూ ఇక్కడే ఉండాలని చెప్పి ఆకాశ గంగ వైపు వెళ్లిపోయింది. అటు పై ఎప్పటికీ తిరిగి రాలేదు.అందువల్లే ఇక్కడ ఉన్న ఆంజనేయుడికి బేడి ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. తన తల్లి రాక కోసం ఆంజనేయస్వామి ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడని చెబుతారు. అప్పటి నుంచి తిరుమల వచ్చే యాత్రికులకు, శ్రీవారికి అనుసంధానకర్తగా తొలిగా అందరికీ దర్శనమిచ్చేది రామభక్తాగ్రేసరుడైన శ్రీ బేడి ఆంజనేయస్వామి. సన్నిధి వీధిలో శ్రీ వేంకటేశ్వరునికి అభిముఖంగా అంజలి ఘటిస్తున్న భంగిమ లో చేతులకు కాళ్ళకు బేడీలు తగిలించుకుని నిలిచి ఉన్న శ్రీ బేడీ ఆంజనేయస్వామి దర్శనమిస్తారు. అందువల్లే ఈయనను బేడీ ఆంజనేయస్వామి అంటారు. క్రీ.శ.1841 ప్రాంతంలో దేవస్థానం అధికారులైన మహంతు వల్ల ఉత్తరదేశమైన పూరీ జగన్నాథం నుంచి వచ్చిన సంప్రదాయ మే ఈ బేడీ ఆంజనేయస్వామి అని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆంజనేయ స్వామి ఆలయం ముఖ మండపం, గర్భాల యం అని రెండు భాగాలుగా నిర్మింపబడింది. గర్భాలయంలో గోడవరకూ మధ్యలో సుమారు 6 అడుగుల నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.గర్భాలయంపై ఏక కలశ గోపురం నిర్మింపబ డింది. గోపురానికి నాలుగు మూలల్లో ఆనంద నిలయానికి వలెనే సింహాలు ఉన్నాయి. ఇటీవలే ఈ ఆలయానికి ప్రదక్షిణ మండపం కూడా నిర్మింపబడింది. వెంకటేశ్వరస్వామి ని అంజనా దేవి వేడుకున్నదానికి అనుగుణంగా ప్రతిరోజు మూడుపూటలా శ్రీ వేంకటేశ్వరుని నివేదనానంతరం భక్త శిఖామణియైన శ్రీ బేడీ ఆంజనేయస్వామికి నైవేద్యం జరుగుతోంది. ఈ నివేదన శ్రీ స్వామివారి ఆలయం నుండే పంపబడుతున్నది. ప్రతి ఆదివారం ఈ మూర్తికి పంచామృతాభిషేకం పూజా నివేదనాలు జరుగుతున్నాయి. ప్రతినెలా పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతారామలక్ష్మ ణులు ఊరేగుతూ ఇక్కడకు వస్తారు. శ్రీ సీతారామలక్ష్మణులకు ఇచ్చిన శేషహారతిని ఆంజనేయస్వామి వారికి ఇస్తారు. శ్రీరాముల వారి మెడలోని పుష్పహారాన్ని ఈ బేడీ ఆంజనేయస్వామికి సమర్పిస్తారు.అలాగే ప్రతి బ్రహ్మోత్సవంలో జరిగే గరుడోత్సవం ఏపీ ప్రభుత్వం ఈ బేడీ ఆంజనేయస్వామి వారి ఆలయం నుండే ఊరేగింపుగా తీసుకెళ్ళి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి పట్టుపస్త్రాలను సమర్పిస్తారు.

Related posts

‘మట్కా’ నుంచి వింటేజ్ బ్రాండ్ న్యూలుక్ పోస్టర్స్

అక్టోబరు 19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల విడుదల

అయ్యప్ప ఆలయ దర్శనం పై కేరళ సర్కార్ నిర్ణయం ఆమోద యోగ్యమేనా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More