శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి లు నిర్మాతలు గా
సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. దసరా సందర్భం గా అక్టోబర్ 12న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ వీడియో క్రియేట్ చేసి రిలీజ్ చేశారు.
వీడియో గమనిస్తే..‘జనక అయితే గనక’ ఓవర్‌సీస్ హక్కులు సొంతం చేసుకున్న హీరో సుహాస్‌కి అందరూ ఫోన్ చేసి సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడని అడుగుతుంటారు. వీరి గోల భరించలేక.. నిర్మాత దిల్ రాజుకి సుహాస్ ఫోన్ చేసి రిలీజ్ డేట్ గురించి అడగటం.. ఆయన దానికి మాట్లాడుతూ మన సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి దసరా సందర్భంగా అక్టోబర్ 12న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. ఈ సంభాషణను ఫన్నీగా ఉంటూనే.. రిలీజ్ డేట్ అక్టోబర్ 12 అని రిజిష్టర్ అయ్యేలా రూపొందించారు.