‘ఆహా’ లో “గొర్రె పురాణం”

తెలుగులో కొత్తదనంతో తెరకెక్కిన కలర్‌ఫోటో వంటి సినిమాలకు ఆహా వేదికగా అవకాశమిచ్చి కొత్త ఆలోచనలకు ప్రోత్సాహాన్ని అందించింది. జాతీయ అవార్డును అందుకున్న ఈ సినిమా తో సుహాస్‌ మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. అదే కోవలో ప్రసన్నవదనం, గొర్రె పురాణం వంటి ట్రెండ్‌ సెట్టింగ్‌ సినిమాలతో సుహాస్‌ తనకంటూ సరికొత్త కథలను ఎంచుకుంటూ తెలుగు పేక్షకులకు మరింత దగ్గరైతున్న సుహాస్‌ కొత్త మూవీ గొర్రె పురాణం ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది.
గొర్రె పురాణంలోని వైవిధ్యాన్ని గుర్తించిన ఆహా ఈ సినిమాను సొంతం చేసుకుంది. ఈ తరహా సినిమాలకు బాగా ఇష్టపడుతున్న టాలీవుడ్‌ ప్రేక్షకులు గొర్రె పురాణం సినిమాని ఆస్వాదిస్తున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం కళ, కళాత్మకత, సినిమాపై అమిత పైన ఇష్టంతో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామంటే… ఆహా వంటి వేదికలు మాకు వారదులుగా నిలుస్తు, ప్రోత్సాహాన్ని అందించడమే ప్రధాన కారణమని నటుడు సుహాస్ తెలిపారు.

విభిన్న భాషల్లోని ఓటీటీ వేదికలు ఎలా ఉన్నప్పటికీ తెలుగు భాషలో మాత్రం ఆహా ఓటీటీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ముఖ్యంగా సినిమాల పరంగా వినూత్నమైన కథ, కథనాలకు విశేషమైన ఆదరణ పొందడానికి ఆహా అందించిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. పాన్‌ ఇండియా స్థాయిలో మాత్రమే కాదు గ్లోబల్‌ వేదికపై ఆదరణ పొందిన థ్రిల్లర్‌, సస్పెన్స్‌, పారానార్మల్‌ థ్రిల్లర్స్‌, సైకలాజికల్‌, సైంటిఫిక్‌, సోసియో ఫాంటసీ వంటి విభిన్న జానర్ల సినిమాలను తెలుగులో చూడగలుగుతున్నాం. వైవిద్యమైన కథనాలతో, వినూత్నమైన సినిమాటిక్‌ విలువలతో నిర్మితమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించడంలో ఆహా ముందుంది. ప్రాంతీయ నేపథ్య సినిమాల పరంగా మలయాళీ సినిమాల్లో మంచి వైవిధ్యం ఉంటుంది. సునిశితమైన కథనాలే కావొచ్చు, సహజత్వాన్ని ప్రదర్శించడమే కావొచ్చు..మలయాళీ సినిమాల్లో ఆ ఆర్థత ఉంటుందనేది విధితమే. ఈ ఫ్లేవర్‌ తెలుగు ప్రజలకు అందించంలో కూడా ఆహా ముందుంది. ఈ ప్రయత్నంలోనే భాగంగా చాప్రా మర్డర్‌ కేస్‌, అయ్యప్పన్‌ కోషియన్‌, ఆహా, డెరిక్‌ అబ్రహమ్‌, భార్గవి నిలయం వంటి మలయాళ సినిమాలను ఆహా వేదికగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంది. వినూత్నత్వంతో వస్తున్న టాలీవుడ్ సినిమాలను కూడా ప్రోత్సహించడంలో ఆహా విశేషంగా కృషి చేస్తుంది ఈ మధ్య విశేష ఆదరణ పొందిన మారుతీనగర్‌ సుబ్రమణ్యం, 35 వంటి సినిమాలే దీనికి నిదర్శనం. ఈ మధ్యకాలంలో ఐఎమ్‌డీబీ అత్యదిక రేటింగ్‌ ఇచ్చిన సింబా సినిమా కూడా ఆహాలో స్ట్రీమ్ంగ్‌ అవుతుంది. చిన్ని సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్‌ ఉంటే చాలు మేము ప్రోత్సాహం అందిస్తామంటున్నారు ఆహా యజమాన్యం.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More