అమెరికాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా నలుగురు కొత్త దర్శకులతో ఓ ఆంథాలజీ చిత్రం రూపుదిద్దుకుంటుంది.సూరత్ రాంబాబు, కె బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్, మావిటి సాయి సురేంద్రబాబులు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం లో సాయి కుమార్, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలు దీనికి ‘మూడో కన్ను’ అన్న టైటిల్ ఫిక్స్ చేశారు. సెవెన్ స్టార్ క్రియేషన్స్ మరియు ఆడియన్స్ పల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సునీత రాజేందర్, ప్లాన్ బి డైరెక్టర్ కె.వి రాజమహి నిర్మిస్తున్న దీనిలో నాలుగుకథలను నలుగురు దర్శకులు షూట్ చేశారు. కొత్త కంటెంట్ తో వస్తున్న ప్రతిభ గలవాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమా చేస్తున్నానట్లు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్న సాయి కుమార్ చెప్పరు. ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న మరో నటుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కథ అత్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుందని చెప్పారు.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతున్న కొత్త కాన్సెప్ట్ అని, కొత్త టాలెంట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరిస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు.