కొరియోగ్రాఫర్ జానీ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఫిల్మ్ ఛాంబర్

టాలీవుడ్ లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ జానీ లైంగిక వేధింపుల కేసును
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీరియస్ గా తీసుకుంది. 2018లోనే ఏర్పాటైన లైంగిక వేధింపుల పరిష్కార పిర్యాదు ప్యానెల్‌ మహిళా కొరియోగ్రాఫర్ నుండి వచ్చిన ఫిర్యాదును స్వీకరించింది. తెలుగు ఫిల్మ్ & టీవీ డ్యాన్సర్స్ & డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ మీద వచ్చిన ఫిర్యాదు విచారణ దశ లో వుండడం తో యూనియన్‌ ప్రెసిడెంట్ పోస్ట్‌లో కొనసాగకుండా చూడాలని అలాగే విచారణ పూర్తయ్యే వరకు తాత్కాలికంగాపదవి నుంచి తప్పుకోవాలని సిఫార్సు చేస్తూ కమిటీ మధ్యంతర నివేదికను ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి ఈ కేసు విచారణకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ కు కే ఎల్. దామోదర్ ప్రసాద్ సెక్రటరీ మరియు కన్వీనర్ గా వ్యవహరిస్తుండగా చైర్‌పర్సన్ గా ఝాన్సీ నీ నియమించారు.. తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిభొట్ల, ప్రగతి మహావాది ,రామలక్ష్మి మేడపాటి కావ్య మండవ సభ్యులు గా వ్యవహరిస్తున్నారు.. ఈ కేసు విచారణే కాకుండా పరిశ్రమ లో వున్న మరెవరైనా ఏదైనా లైంగిక వేధింపుల ఫిర్యాదుల విషయంలో మహిళలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించవచ్చని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది .. కార్యాలయం దగ్గర కంప్లయింట్ బాక్స్ ఏర్పాటు జరిగిందని దీనిని ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య యాక్సెస్ చేయవచ్చని పేర్కొన్నారు. పోస్ట్ లేదా కొరియర్ ద్వారా కూడా
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డా. డి. రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్-500 096. అన్న చిరునామా కు పంపవచ్చని అలాగే కంప్లయింట్ నమోదు చేయడానికి ప్రత్యేక వాట్సాప్ ఫోన్(వాట్సాప్) నెంబర్ 9849972280, తో పాటు ఈమెయిల్ ఐడీ complaints@telugufilmchamber.in కు పిర్యాదులు పంపి నమోదు చేసుకోవచ్చని వచ్చిన కంప్లయింట్స్ తో పాటు పంపిన వివరాల విషయం లో అత్యంత గోప్యత పాటించనున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది..ఇదిలా వుండగా జనసేన పార్టీ కూడా ఈ కేసు తేలేవరకు జానీ మాష్టర్ నీ పార్టీ కార్యకలాపాలకు దూరం పెడుతున్నట్టు ప్రకటించింది.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More