- దర్శకుడు కొరటాల శివ
“దేవర”లో భయం అనే ఒక ఎమోషన్ సినిమా మొత్తం క్యారీ అవుతుంటుంది. నిజానికి ప్రతి మనిషిలో భయం ఉండాలి. మనం ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయకపోవడానికి కారణం భయమే. అది బాధ్యతతో కూడిన భయం. ఆ భయాన్నే సినిమాలో మెయిన్ థీమ్ గా పెట్టుకున్నానని చిత్ర దర్శకుడు కొరటాల శివ చెప్పారు.. అల్లు అర్జున్ హీరోగా నా దర్శకత్వంలో ఒక సినిమా ఎనౌన్స్ చేసి, అనంతరం ఆ ప్రాజెక్ట్ ను కారణాంతరాల వలన డ్రాప్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో దేవర కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ తో ఉండేసరికి, ఇదే ఆ సినిమా అనుకుంటున్నారు కానీ.. ఆ ప్రాజెక్ట్ కు దేవరకు ఏమాత్రం సంబంధం లేదు.
ఎన్టీఆర్ చాలా హానెస్ట్ గా వుంటాడు..
నేను ఎన్టీఆర్ ను ఒక బ్రదర్ లా ట్రీట్ చేస్తాను. అతను కూడా అదే స్థాయిలో నాతో బంధం పంచుకుంటాడు. నేను ఏదైనా సీన్ చెప్తే బాగుంది అనిపిస్తే “అబ్బా అదిరిపోయింది” అని చెప్తాడు. ఒకవేళ నచ్చకపోతే కూడా అదే ఉచ్ఛస్థాయిలో బాలేదని చెప్పేస్తాడు. ఎన్టీఆర్ అంత హానెస్ట్ గా ఉంటాడు కాబట్టే ప్రొడక్ట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ ఉండదు.
దేవర కథను కావాలని రెండు భాగాలుగా విడదీయలేదు. నేను కథ రాసుకున్నప్పుడే 6 గంటల నిడివి వచ్చింది. అయినా కూడా వద్దులే ఒక పార్ట్ గానే రిలీజ్ చేద్దామని షూటింగ్ స్టార్ట్ చేశాం. కానీ.. షూటింగ్ చేస్తున్నప్పుడు అవుట్ పుట్ చూసుకుని ఈ సినిమాని ఒక్క పార్ట్ గా రిలీజ్ చేయడం కష్టం అని నేను, తారక్ డిసైడ్ అయ్యి తర్వాత రెండు భాగాలుగా విడుదల చేద్దామని ఆ మేరకు పనులు మొదలెట్టాము. పార్ట్ 2 షూటింగ్ కి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే.. ఎన్టీఆర్ ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యారు, అవన్నీ పూర్తయ్యాక పార్ట్ 2 పనులు మొదలుపెడతాం. ఈ సినిమాకి మూడో పార్ట్ తీసే ఆలోచన ఏమాత్రం లేదు. రెండు భాగాలతోనే ముగిస్తాం.
చిరంజీవి గారితో పొరపొచ్చాలు లేవు
ఆచార్య రిజల్ట్ విషయంలో కాస్త ఈ విషయం వాస్తవమే కానీ, ఆ రిజల్ట్ నా మీద ఎఫెక్ట్ చూపించే స్థాయి గ్యాప్ నేను తీసుకోలేదు. “ఆచార్య” విడుదలైన 20 రోజులకు “దేవర” మోషన్ పోస్టర్ వర్క్ మొదలుపెట్టాం. అందువల్ల ఆ రిజల్ట్ ను కానీ, రిజల్ట్ ఎఫెక్ట్ ను కానీ నేను తర్వాత పట్టించుకోవాల్సిన పని పడలేదు. మీడియాలో చిరంజీవిగారికి నాకు మధ్య పొరపచ్చాలు వచ్చాయి అని చాలా కథనాలు వచ్చాయి కానీ.. నిజానికి మా ఇద్దరి మధ్య సఖ్యత బాగానే ఉంది. “ఆచార్య” రిలీజ్ తర్వాత రిజల్ట్ డిక్లేర్ అయ్యాక నాకు మొదట మెసేజ్ చేసిన వ్యక్తి చిరంజీవి గారే. “యు విల్ బౌన్స్ బ్యాక్ స్ట్రాంగర్ శివ” అని ఆయన పంపిన మెసేజ్ ను నేను ఎప్పడు మర్చిపోను. అందువల్ల ఆయనతో నాకు మనస్పర్థలు ఉన్నాయనే వదంతుల్ని నేను పట్టించుకోను.”దేవర” ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే.. మేము ఆడియన్స్ తో మాట్లాడే ఏకైక సందర్భం అది. అందరం స్పీచులు ప్రిపేర్ అయ్యాం. ఎవరి గురించి మర్చిపోకుండా మాట్లాడాలి అని ఒకటికి పదిసార్లు పేర్లు క్రాస్ చేసుకొని రెడీ అయ్యాక ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం బాధాకరం. దానికి ఎవరు కారణం అని నన్ను అడిగితే నేనేం చెప్పలేను.నేను ట్విట్టర్ కి దూరమవ్వడానికి కారణం మితిమీరిన నెగిటివిటీ. నేను సరదాగా నా సినిమా గురించి ఏమైనా పంచుకుందాం అనుకొని ట్విట్టర్ లో చేరాను. కానీ అక్కడ పాజిటివ్ మైండ్ అనేది నాకు కనిపించలేదు. మీమ్స్ వేసుకోవచ్చు, జోకులు వేసుకోవచ్చు కానీ హేట్రెడ్ అనేది మంచిది కాదు సినిమా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అయ్యాక వచ్చిన ఫీడ్ బ్యాక్ ను తప్పకుండా తీసుకుంటాను. గ్రాఫిక్స్ విషయంలో మొన్నటివరకు బెటర్ మెంట్ కోసం చెక్కుతూనే ఉన్నాం. ముఖ్యంగా షార్క్ ఫిష్ ఎపిసోడ్ & సీజీ వర్క్ విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరించాం నేను వరుసబెట్టి దేవిశ్రీప్రసాద్ తో వర్క్ చేసాక, నేను మరీ కంఫర్ట్ జోన్ లో ఉండిపోతున్నానేమో అనిపించింది. అందుకే దేవికి చెప్పాను “కొంచెం గ్యాప్ తీసుకొని మళ్లీ కలిసి వర్క్ చేద్దామని”. తర్వాత “ఆచార్య” కోసం మణిశర్మ, ‘దేవర” కోసం అనిరుధ్ తో వర్క్ చేసాను. కచ్చితంగా నెక్స్ట్ సినిమాకి దేవిశ్రీప్రసాద్ తో వర్క్ చేస్తాను.