అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ‘ఆ ఒక్కటీ అడక్కు’ లో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కంటెంట్ చాలా ఉందని కథానాయాక ఫరియా అబ్దుల్లా చెప్పుకొచ్చారు. విలేకరులతో చిత్ర విశేషాలతో పాటు ఎన్నో అంశాలను పంచుకున్నారు.టిపికల్ హీరోయిన్ గా మాస్ మసాలా సినిమా చేయాలని వుందని ఇప్పుడు పరిశ్రమలో యాక్షన్ సినిమాలు చేసే హీరోయిన్స్ తక్కువగా వున్నారు. ఆ ఖాళీని భర్తీ చేయాలని వుంది. యాక్షన్ సినిమాలు నాకు బాగా నప్పుతాయని భావిస్తున్నాను అలాగే హారర్ థ్రిల్లర్ తో కామెడీ సినిమా చేయాలని వుందన్నారు. . అన్ని ప్లాన్ చేసి, నిబంధనలు పెట్టుకొని అందులోనే బ్రతకడం ఇష్టం వుండని సిద్ధి అనే పాత్ర ఈ చిత్రం లో చేస్తున్నానని చెప్పారు. హీరో పాత్ర భిన్నంగా అన్నీ ప్లాన్ ప్రకారం చేసుకునేలా ఉంటుందని రెండు పాత్రల మధ్య మంచి కాన్ఫ్లిక్ట్ వుంటుంది. అదే సమయంలో మంచి ఎట్రాక్షన్ ఉండి పెళ్లి అనే అంశం చుట్టూ తిరుగుతూ అందరినీ ఆకట్టుకునేలా వుంటుందన్నారుదర్శకుడు మల్లి గారు నాకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారు. అది నాకు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించిందన్నారు..