డబుల్ ఇస్మార్ట్ మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ ని ఎంజాయ్ చేస్తారు-ఉస్తాద్ రామ్ పోతినేని

పూరి గారు గన్ లాంటి వారు. పేల్చే గన్ బావుంటే బుల్లెట్ ఎంత ఫోర్స్ గా అయినా వెళ్తుంది. పూరి గారు లాంటి గన్ అందరి యాక్టర్స్ కి కావాలి. డబుల్ ఇస్మార్ట్ మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ క్యారెక్టర్. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా మనికి నచ్చిందే చేయాలి. పక్కోడి గురించి పట్టించుకుంటే పనులు జరగవని రామ్ పోతినేని అన్నారు.. రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ కాంబినేషన్‌లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌ పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేని కి జోడీగా కావ్య థాపర్ నటించిన డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో వరంగల్ లో’డబుల్ ఇస్మార్ట్’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.


ఇందులో ఉస్తాద్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. పూరి గారితో ఎనర్జీ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా వుంది. ఆయనతో పని చేసినప్పుడు వచ్చే కిక్ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. పూరిగారు మోస్ట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్స్ అఫ్ తెలుగు సినిమా. రైటర్, డైరెక్టర్ కావాలని వచ్చిన వారు పూరి గారి చూసి స్ఫూర్తి పొందే వస్తారు ఇస్మార్ట్ శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ ఈవెంట్ కి ఇక్కడి రావడం చాలా హ్యాపీగా వుంది. మణిశర్మ గారు అద్భుతమైన ఆల్బం ఇచ్చారు, ఇస్మార్ట్ శంకర్ కి మించి చేశారు. స్క్రీన్ మీద చూశాక పాటలు ఇంకా నెక్స్ట్ లెవల్ కి వెళ్తాయి. సంజయ్ దత్ గారితో కలిసి పని చేయడం ఆనందంగా వుంది. ఈ పాత్రని ఆయన తప్పితే మరొకరు చేయలేరు. కావ్య చాలా మంచి అమ్మాయి.చాలా హార్డ్ వర్క్ చేసింది. విష్ హానెస్ట్ గా తన పని తను చేస్తూ ఉంటాడు. చార్మి గారు ఫైటర్. ఆమె లేకుండా ఈ సినిమా పాజిబుల్ అయ్యేది కాదని అన్నారు. డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ మాట్లాడుతూ.. హాయ్ ఎవ్రీ వన్. మీ ఊరు రాకుండా మిమ్మల్ని కలవకుండా మా సినిమాలు రిలీజ్ అవ్వవ్. డబుల్ ఇస్మార్ట్ గురించిమాట్లాడాలంటే ఒకే ఒక పేరు.. రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్.. రామ్ పోతినేని ఎనర్జీ. రామ్ ని సెట్స్ లో చూసిననప్పుడు తనలో కసి కనిపిస్తుంటుంది, అది నన్ను చాలా ఎక్సయిట్ చేస్తుంది. తన క్యారెక్టర్, హెయిర్ స్టయిల్, నడక, స్లాంగ్.. ఇవన్నీ తను పెర్ఫార్మ్ చేయడం వలనే అవుతుంది. తను వెరీ గుడ్ యాక్టర్, డ్యాన్సర్. రామ్ పోతినేని లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు. థాంక్ యూ రామ్. సంజు బాబాకి నేను పెద్ద ఫ్యాన్ ని. 150 సినిమాల హీరో ఆయన. ఆయన ఈ సినిమాలో చేయడం కొత్త కలర్ తీసుకొచ్చింది. కావ్య చాలా బాగా పెర్ఫారం చేసింది. రామ్ పక్కన అద్భుతంగా డ్యాన్స్ చేసింది. తెలుగులో నేర్చుకొని డబ్బింగ్ చెప్పింది. అలీ గారి గురించి ఎక్కువ చెప్పను. ఇందులో అలీ గారి అలీగారి ట్రాక్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో పని చేసిన యాక్టర్స్ కి, టెక్నిషియన్స్ కి థాంక్స్. ఛార్మి కౌర్ మా కంపెనీ స్ట్రెంత్. ఏదైనా పని చెబితే చేసుకొస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఫిలిం మేకింగ్ లో చాలా హార్డ్ టైమ్స్ వుంటాయి. అన్నీట్లో తను నిల్చుంది. విష్ రెడ్డి ఛార్మి వెనుక నిల్చుంటాడు. విష్ మా పిల్లర్. నా దగ్గర రూపాయి లేకపోయినా రోడ్డుమీద వున్నా నేను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. నా వెనుక విషు నిల్చొని వుంటాడు. థాంక్ యూ విషు. రామ్ డబుల్ ఎనర్జీతో ఈ సినిమా చేశాడు. ప్రతి సీన్ ని ఎంజాయ్ చేస్తారు. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. విజయేంద్ర ప్రసాద్ గారు ఒకసారి ఫోన్ చేశారు. నెక్స్ట్ సినిమా ఎప్పుడు తీస్తున్నారు, తీసే ముందు కథ చెప్తారా అని అడిగారు. మీలాంటి డైరెక్టర్స్ ఫెయిల్ అవ్వడం నేను చూడలేను, చిన్న చిన్న తప్పులు ఎవైనా చేస్తుంటారు తీసే ముందు ఒకసారి చెప్పండని అన్నారు. ఆ ఒక్క ఫోన్ కాల్ తో చాల ఎమోషనల్ అయిపోయాను. నామీద ఆయనకి వున్న ప్రేమ అభిమానంతో చేశారు. అయితే తర్వాత ఆయనకి కథ చెప్పలేదు. మనకి తెలిసిన పనే కదా కాస్త వొళ్ళు దగ్గరపెట్టుకొని తీసిన ఆయన్ని కలుద్దామని చెప్పలేదు.(నవ్వుతూ) లవ్ యూ సర్. సినిమా మా అందరికీ బ్లాక్ బస్టర్ కావాలి. ఈ ఈవెంట్ కి వచ్చిన అందరికీ. పోలీస్ డిపార్ట్మెంట్ కి థాంక్స్ అన్నారు.
నిర్మాత ఛార్మి ,పూరి కనెక్ట్స్ సిఈవో విష్ ,హీరోయిన్ కావ్య థాపర్ ,
యాక్టర్ అలీ , గెటప్ శ్రీను , టెంపర్ వంశీ తదితరులు మాట్లాడారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More