‘డబుల్ ఇస్మార్ట్’ డబుల్ మాస్ మ్యాడ్‌నెస్ తో సెలబ్రేట్ చేసుకునే కమర్షియల్ సినిమా- హీరో రామ్ పోతినేని

ఇస్మార్ట్ శంకర్ మెంటల్ మాస్ మ్యాడ్ నెస్.. యాక్ట్ చేస్తున్నపుడు నాకు వచ్చిన కిక్ వేరు. అలాంటి మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ క్యారెక్టర్ తో ఒక కిక్-యాస్ స్క్రిప్ట్ వుంటే ఎలా ఉంటుందని అనుకున్నప్పుడే డబుల్ ఇస్మార్ట్ స్క్రిప్ట్ ని పూరీ రాశారని హీరొ రామ్ పోతినేని చెప్పారు. విశాఖ లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. 2018లో పూరి గారిని గోవాలో కలిశాను. ఎలాంటి సినిమా చేద్దామని అనుకున్నప్పుడు పదేళ్ళ తర్వాత గుర్తుండిపోయే క్యారెక్టర్ చేద్దామని అన్నాను. అప్పుడు ఆయన ఇస్మార్ట్ శంకర్ రాశారు. ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాల్లో అన్నిటికంటే ఎక్కువ టైం తీసుకొని చేశారు. చాలా కష్టపడ్డారు. ఆయనతో పని చేసినప్పుడు ఎంత కిక్ వుంటుందో స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అంతే కిక్ వుంటుంది. కమర్షియల్ సినిమా అంటే గుర్తుకువచ్చేది పూరి గారే. కమర్షియల్ సినిమా అంటే అంత ఈజీ కాదు. కానీ ఒక్కసారి కమర్షియల్ సినిమా హిట్ అయితే దాంట్లో వచ్చే కిక్ ఇంక దేంట్లో రాదు. కమర్షియల్ సినిమాలో థియేటర్స్ లో చేసుకునేది ఒక సెలబ్రేషన్. అది ఇస్మార్ట్ శంకర్ అప్పుడు చూశాను. మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ కి ఆ కిక్ వుంటుందని ఆశిస్తున్నాను. అందరం చాలా ఇష్టపడి చేశాం. అలీ గారు ట్రాక్ చాలా ఎంజాయ్ చేస్తారు. కావ్య స్వీట్ హార్ట్. చాలా మంచి అమ్మాయి. టెంపర్ వంశీ క్యారెక్టర్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆగస్ట్ 15న కలుద్దాం. మార్ ముంతా చోడ్ చింతా. థాంక్ యూ అల్’ అన్నారు. ఈవెంట్ కి రాలేకపోయిన దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పెషల్ వీడియో బైట్ సందేశం పంపారు. ముంబైలో ఫైనల్ మిక్సింగ్ లో వున్న కారణంగా ఈవెంట్ కి రాలేకపోయినట్టు చెప్పారు. వైజాగ్ లోనే తిరిగేవాడిని. అక్కడ ప్రతి థియేటర్ లో సినిమాలు చూశాను. ఆ సినిమా పిచ్చి తగ్గక డైరెక్టర్ ని అయ్యాను.(నవ్వుతూ) సినిమా పెద్ద హిట్ అయ్యాక వైజాగ్ వచ్చి పర్సనల్ గా మీ అందరినీ కలుస్తాను. గల్లీలో తిరిగినవాడిని. నేను తీసిన గల్లీ సినిమా. సీ సెంటర్లో సీటులు వేస్తూ చూడాల్సిన సినిమా. ట్రైలర్ ని ఎంజాయ్ చేయండి. లవ్ యు ఆల్’ అన్నారు.
హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. డబుల్ ఇస్మార్ట్ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. రామ్ గారు, పూరి గారితో వర్క్ చేయడం ఒక బ్లెస్సింగ్ గా భావిస్తున్నాను. ఈ సినిమాలో పార్ట్ కావడం లక్కీగా ఫీలౌతున్నానన్నారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More