గోపీచంద్, శ్రీను వైట్ల చేతుల మీదుగా “ధూం ధాం” టీజర్ విడుదల

ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ .చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో రూపొందిన ధూం ధాం సెప్టెంబర్ 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోన్న నేపథ్యంలో టీజర్ ను స్టార్ హీరో గోపీచంద్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే సమకూర్చుతున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమా టీజర్ చాలా బాగుంది. చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. గోపీ మోహన్ నాతో ఎంతగా ట్రావెల్ చేశాడో మీకు తెలుసు. ఆయన మంచి సెన్సబుల్ రైటర్. ఈ సినిమాకు మంచి స్టోరీ స్క్రీన్ ప్లే చేశారు. డైరెక్టర్ సాయి కిషోర్ నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో దుబాయ్ శీను నుంచి బాద్ షా మూవీ వరకు వర్క్ చేశాడు. ప్యాషన్, డెడికేషన్ ఉన్న డైరెక్టర్. నిర్మాత రామ్ కుమార్ గారు నాకు మంచి మిత్రులు. ఆయన విదేశాల్లో ఉండి సినిమా మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్ల అబ్బాయితో ఫస్ట్ ర్యాంక్ రాజు వంటి మూవీస్ చేశారు. “ధూం ధాం” సినిమా భారీ బడ్జెట్ తో లావిష్ గా నిర్మించారు. విదేశాల్లో షూటింగ్స్ చేశారు. ఈ సినిమా రామ్ కుమార్ గారికి, హీరో చేతన్ కృష్ణకు మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో గోపీచంద్ మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది. మంచి సాంగ్స్ ఉన్నాయి. శ్రీను వైట్ల గారి ద్వారా నాకు రామ్ కుమార్ గారు పరిచయం అయ్యారు. ఆయన మంచి ప్రొడ్యూసర్. డైరక్టర్ సాయి నాకు ఎప్పటినుంచో తెలుసు. డెడికేషన్ ఉన్న పర్సన్. ఈ సినిమాకు స్టోరీ స్క్రీన్ ప్లే చేసిన గోపీ మోహన్ సెన్సబుల్ రైటర్. నాతో లౌక్యం సినిమా నుంచి వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయ్యి రామ్ కుమార్ గారికి, సాయికి, చేతన్ కృష్ణకు మంచి పేరు తీసుకురావాలి. రామ్ కుమార్ గారు నిర్మాతగా మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ సాయికిషోర్ మచ్చా నిర్మాత ఎంఎస్ రామ్ కుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే రైటర్ గోపీ మోహన్ నటుడు వినయ్ వర్మ ,నటుడు గిరి , నటుడు సందేశ్ తదితరులు మాట్లాడారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More