బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కమిటీ కుర్రోళ్ళు’

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం అన్నీ ఏరియాస్‌లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది నాలుగు రోజుల్లో రూ. 7.48 కోట్లు వచ్చాయి. మంచి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో స్నేహం, ప్రేమ‌, కుటుంబంలోని భావోద్వేగాల‌ను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తూ ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రించార‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందని చిత్ర యూనిట్ తెలియజేసింది.

రామ్ చరణ్ అభినందన..

‘ నిహారిక ‘కమిటీ కుర్రోళ్ళు’ అద్భుత‌మైన విజ‌యం సాధించినందుకు అభినంద‌న‌లు. ఈ విజ‌యానికి నువ్వు అర్హురాలివి. నీ టీమ్‌తో నువ్వు ప‌డ్డ క‌ష్టం, పనిలో చూపించిన నిబ‌ద్ధ‌త స్ఫూర్తిని క‌లిగిస్తుంది. మీ టీమ్ చేసిన ప్ర‌య‌త్నానికి హ్యాట్యాఫ్‌. ఈ క‌థ‌కు జీవాన్ని పోసిన ద‌ర్శ‌కుడు య‌దు వంశీకి ప్ర‌త్యేక‌మైన అభినంద‌న‌లు’ అని పేర్కొన్నారు రామ్ చ‌ర‌ణ్‌.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More