ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై ముఖేష్ ప్రజాపతి తెరకెక్కిస్తున్న బహిష్కరణ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్ టీజర్‌ను విడుదల చేశారు.
ప్రశాంతమైన పల్లెటూరు.. బస్సులో కూర్చున్న అమ్మాయి (అంజలి) ఆ స్వచ్చమైన గాలిని ఆస్వాదిస్తుంటుంది.. ఈ సన్నివేశంతో ప్రారంభమైన టీజర్ లో ఈ ప్రపంచం లొంగిపోయేది రెండిటికే .. ఒకటి సొమ్ముకి, ఇంకొకటి సోకు అనే డైలాగ్ ఓ అమ్మాయి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్న తీరుని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంజలి మరో విలక్షణమైన పాత్రలో మెప్పించే ప్రయత్నం చేసిందని టీజర్‌లో ఆమె నటించిన సన్నివేశాలను చూస్తుంటే అర్థమవుతుంది. ఓ వైపు ప్రేమ కురిపిస్తూనే మరో వైపు ఆగ్రహావేశంతో ఊగిపోయే ఆమె పాత్రను చూస్తుంటే ఆమె పోషించిన పాత్రలోని భావోద్వేగాలు ఎంత లోతుల్లో ఉన్నాయో అర్థమవుతుంది. ప్రశాంతంగా ఉండే ఆ పల్లెటూరుకి అమ్మాయి ఎందుకు వచ్చింది.. ఆమెకు అక్కడ ఎదురైన పరిస్థితులేంటి? ఆమె ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది.. ఎందుకు? అనే విషయాలు తెలియాలంటే జూలై 19న జీ5 (ZEE 5)లో స్ట్రీమింగ్ కానున్న ‘బహిష్కరణ’ సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్‌కు ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.