యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై ముఖేష్ ప్రజాపతి రూపొందించిన వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. . విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో మీడియాతో ‘బహిష్కరణ’ యూనిట్ ముచ్చటించింది. నటి అంజలి మాట్లాడుతూ.. ‘పుష్ప పాత్ర పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక అమాయకపు వేశ్య నుంచి.. అన్ని అసమానతలను ఎదుర్కొనేందుకు శక్తి, ధైర్యాన్ని కూడగట్టుకునే స్త్రీ ప్రయాణం ఇందులో అద్భుతంగా ఉంటుందన్నారు. దర్శకుడు ముఖేష్ ప్రజాపతి మాట్లాడుతూ.. ‘బహిష్కరణలో అద్భుతమైన, శక్తివంతమైన కథ, కథనాలున్నాయి. అందులోని ప్రతీ పాత్ర, ఆ ఎమోషన్స్ ఎంతో సంక్లిష్టంగా, లోతుగా ఉంటాయి. సముద్రంలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి జోలికి పోతే వినాశనం ఎలా ఎదురువుతుందో ఇందులో చూపించాం. పుష్ప పాత్రలో అనేక లేయర్స్ ఉంటాయి.. ఎన్ని కష్టాలు వచ్చినా, ఏం జరిగినా కూడా ధైర్యంగా అడుగు ముందుకు వేసి ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. అంజలి తన అసాధారణమైన నటనతో పుష్ప పాత్రకు ప్రాణం పోశారనీ చెప్పారు. పిక్సెల్ పిక్చర్స్ ప్రై. లి. అధినేత, నిర్మాత ప్రశాంతి మలిశెట్టి.. మాట్లాడుతూ
అంజలి ఇది వరకెన్నడూ చేయనటువంటి, పోషించనటువంటి పాత్రలో కనిపిస్తారు.మా దర్శకుడు ముఖేష్ ప్రజాపతి, అసాధారణమైన కథతో, ఎంతో లోతైన ఎమోషన్స్‌తో మరెంతో ఉద్వేగభరితమైన వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. పిక్సెల్ పిక్చర్స్‌లో కంటెంట్ కింగ్.. కాంటెక్స్ట్ గాడ్ అని నమ్ముతాం. మన సమాజంలోని వాస్తవికతలను, పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ సిరీస్ ఉండనుందని అన్నారు.