ఎబై వసంతాల కథానాయకుడు కి టాలీవుడ్ సత్కారం… ఎప్పుడంటే…?

నందమూరి తారకరామారావు నట వారసుడిగా 1974 ఆగస్టు న విడుదలైన “తాతమ్మ కల”తో సినీ కెరీర్ ను ప్రారంభించి అప్పటినుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హ్యాట్రిక్ హిట్లతో కొనసాగుతూ వైవిధ్యమైన పాత్రల్లో హీరోగా కొనసాగుతున్న ప్రపంచంలోనే ఏకైక కళాకారుడు నందమూరి బాలకృష్ణ. ఆయన సినీ గోల్డెన్ జూబిలీ ఇయర్ ని పురస్కరించుకుని టాలీవుడ్ ఘనంగా సత్కరించనుంది..

సెప్టెంబర్ 1న ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసి బాలకృష్ణ ని కలసి అంగీకారాన్ని కోరారు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ విజ్ఞప్తి ని బాలయ్య బాబు అంగీకరించారని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి ప్రసన్నకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ రంగంలో, వరుసగా మూడు సార్లు శాసనసభకు ఎన్నికైన హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న హైదరాబాద్లోని బసవ తారకం ఇండో-బ్రిటీష్ క్యాన్సర్ హాస్పిటల్ కు ఛైర్మన్ గా ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు ఆయన చేసిన అవిశ్రాంత కృషి మరువలేనిదని ఇక్కడ కేవలం భారతదేశం నుండి వచ్చిన రోగులు మాత్రమే కాకుండా విదేశాల నుండి వచ్చిన రోగులుకూడా చికిత్స పొందుతున్నారని ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తు సినీ పరిశ్రమలో, అలాగే ప్రజాసేవలో ఆయన చేసిన సేవలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయని పేర్కొన్నారు.. ఈ సందర్భంగా శ్రీ నందమూరి బాలకృష్ణ గారు తన సినీ కెరీర్ లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ కె.ఎల్. దామోదర్ ప్రసాద్, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి మరియు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు, శ్రీ సునీల్ నారంగ్, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, శ్రీ టి. ప్రసన్న కుమార్, గౌరవ కార్యదర్శి మరియు కోశాధికారి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలచిత్ర నిర్మాతల మండలి, మరియు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 క్రాఫ్ట్స్ ప్రెసిడెంట్ శ్రీ వల్లభనేని అనిల్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియచేస్తూ 01 సెప్టెంబరు 2024న తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయనకు సన్మానం చేయబోతోందనీ, అందుకు అంగీకరించాల్సిందిగా అభ్యర్ధించారు. భారతీయ సినిమా మరియు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ సన్మాన సభలో పాల్గొంటారు. శ్రీ నందమూరి బాలకృష్ణ గారు వారి అభ్యర్థనను అంగీకరించారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More